Jammu and Kashmir : 68.72% పోలింగ్
ABN, Publish Date - Oct 02 , 2024 | 03:28 AM
జమ్మూ-కశ్మీర్‌లో మంగళవారం చివరిదైన మూడో దశ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మూడో దశలో 68.72%, మొత్తంగా(మూడు దశల్లో కలిపి) 64.45 శాతం ఓటింగ్ నమోదైంది.
జమ్మూ కశ్మీర్‌లో ముగిసిన ఓటింగ్
మూడో దశలో రికార్డు స్థాయిలో పోలింగ్
మూడు దశల్లో కలిపి మొత్తం 64.45%
తొలిసారిగా ఓటువేసిన శరణార్థులు, వాల్మీకులు, గూర్ఖాలు
జమ్మూ కశ్మీర్ మూడో దశలో 68.72% పోలింగ్
జమ్మూ/శ్రీనగర్, అక్టోబరు1: జమ్మూ-కశ్మీర్‌లో మంగళవారం చివరిదైన మూడో దశ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మూడో దశలో 68.72%, మొత్తంగా(మూడు దశల్లో కలిపి) 64.45 శాతం ఓటింగ్ నమోదైంది. అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖల వద్ద ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లోనూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని అధికార వర్గాలు పేర్కొన్నాయి. జమ్మూ, కశ్మీర్‌ల్లోని ఏడు జిల్లాల్లో ఉన్న 40 నియోజకవర్గాల్లో మూడో దళ ఓటింగ్ జరిగింది. ఆర్టికల్ 370 అధికరణం రద్దు కారణంగా తొలిసారి ఓటు హక్కు పొందిన పశ్చిమ పాకిస్థాన్ శరణార్థులు, వాల్మీకీ సమాజ్, గోర్ఖా సామాజిక వర్గం ఓటర్లు ముందుగానే లైన్లలో నిల్చొన్నారు. ఇది ‘చరిత్రాత్మక సందర్భమ’ని వారు అన్నారు. కశ్మీరీ శరణార్థుల కోసం ఢిల్లీలో నాలుగు, ఉధంపూర్ జిల్లాలో ఒకటి, జమ్మూలో 19, మొత్తం 24 ప్రత్యేక పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. శాంతిభద్రతల కోసం 400కుపైగా కంపెనీల దళాలను నియమించారు.
Updated Date - Oct 02 , 2024 | 03:28 AM