Kerala: భారీ వర్షంలో.. గుహలో ఉన్న ఫ్యామిలీని..
ABN, Publish Date - Aug 03 , 2024 | 02:14 PM
దేవభూమి కేరళపై ప్రకృతి ప్రకోపించింది. వయనాడు జిల్లాలో కొండచరియలు విరిగిపడ్డాయి. తర్వాత భారీ వర్షం కూడా కురిసింది. ఆ ప్రభావం కొన్ని గ్రామాలపై పడింది. 350 మందికి పైగా చనిపోగా, వందల సంఖ్యలో గాయపడ్డారు. ఆ క్రమంలో అటవీ అధికారులు చేపట్టిన సహాయక చర్యలను యావత్ దేశం ప్రశంసిస్తోంది. వారు నిజంగా హీరోలు అని కేరళ సీఎం పినరయి విజయన్ కొనియాడారు. ఫారెస్ట్ అధికారులను సోషల్ మీడియా ఆకాశానికి ఎత్తేసింది.
వయనాడు: దేవభూమి కేరళపై (Kerala) ప్రకృతి ప్రకోపించింది. వయనాడు జిల్లాలో కొండచరియలు విరిగిపడ్డాయి. తర్వాత భారీ వర్షం కూడా కురిసింది. ఆ ప్రభావం కొన్ని గ్రామాలపై పడింది. 350 మందికి పైగా చనిపోగా, వందల సంఖ్యలో గాయపడ్డారు. ఆ క్రమంలో అటవీ అధికారులు చేపట్టిన సహాయక చర్యలను యావత్ దేశం ప్రశంసిస్తోంది. వారు నిజంగా హీరోలు అని కేరళ సీఎం పినరయి విజయన్ కొనియాడారు. ఫారెస్ట్ అధికారులను సోషల్ మీడియా ఆకాశానికి ఎత్తేసింది.
ఇలా తెలసింది..
కొండచరియలు విరిగిపడిన తర్వాత అధికారులు, అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్, అటవీ సిబ్బంది, ఆర్మీ, నౌకాదళ సిబ్బంది రంగంలోకి దిగారు. ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న వారిని కాపాడారు. వరదలతో పానియా తెగకు గిరిజన కుటుంబం చిక్కుకొని ఉంది. ఆ విషయం తెలిసిన కలపేట రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ కే హసిస్ ముగ్గురు సభ్యులతో రంగంలోకి దిగారు. భార్య, భర్త, నలుగురు చిన్నారులు గుహలో ఉన్నారని.. పిల్లల వయస్సు ఏడాది నుంచి నాలుగేళ్లు ఉంటుందని ఆయన వివరించారు. అటవీ ఉత్పత్తులను సేకరించి, మార్కెట్‌లో విక్రయిస్తుంటారు. అలా బియ్యం కొనుగోలు చేసి వంట చేసుకుని జీవించేవారు. కొండ చరియలు విరిగి పడటం, భారీ వర్షాలతో వారు మార్కెట్‌కు వెళ్లడం వీలు పడలేదు. గత 5 రోజుల నుంచి ఆ గుహలోనే ఉన్నారు. ఆకలితో అలమటించారు.
ఆపరేషన్ ఇలా..?
గుహలో ఉన్న వారి వద్దకు ట్రెక్కింగ్ చేయాల్సి వచ్చింది. ఏటవాలుగా రాళ్లు ఉన్నాయి. అతి కష్టం మీద వారి వద్దకు చేరుకున్నాం. అప్పటికే తమ వద్ద ఉన్న ఆహార పదార్థాలను పిల్లలకు తినిపించాం. చిన్నారులను శరీరానికి కట్టుకొని తిరిగి ట్రెక్కింగ్ ప్రారంభించాం. చెట్లు, రాళ్లకు తాడు కట్టి అత్తమాల కార్యాలయానికి చేరుకున్నాం. అక్కడ పిల్లలకు ఆహారం అందజేశాం. బట్టలు కూడా ఇచ్చాం. ఆరు విలువైన ప్రాణాలను కాపాడాం. గుహలో ఉన్న వారిని తీసుకొచ్చేందుకు 8 గంటల సమయం పట్టింది అని’ ఫారెస్ట్ అధికారి కే హషిస్ వివరించారు. హసిష్ వెంట సెక్షన్ ఫారెస్ట్ అధికారి బీఎస్ జయచంద్ర, బీట్ అధికారి కే అనిల్ కుమార్, ఆర్ఆర్టీ అనూప్ థామస్ ఉన్నారు.
వందనం..
‘ఆ ఫారెస్ట్ అధికారుల తెగువ చీకట్లను పారదోలి కేరళను మరింత ప్రకాశవంతంగా మార్చింది. ప్రజలను మరింత ఐకమత్యంగా ఉంచుతుంది. కేరళను పునర్మించుకుందాం. మరింత బలోపేతం అవుదాం. ఫారెస్ట్ అధికారులు నిజమైన హీరోలు అని’ కేరళ సీఎం పినరయి విజయన్ ప్రశంసల వర్షం కురిపించారు.
Updated Date - Aug 03 , 2024 | 02:14 PM