ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Sitaram Yechury: అవయవాలు తీసి, ఎముకలు తొలగించి.. సీతారాం ఏచూరి శరీరాన్ని చివరికి..

ABN, Publish Date - Sep 14 , 2024 | 09:12 PM

సీతారాం ఏచూరి భౌతికకాయాన్ని ఢిల్లీ ఎయిమ్స్‌కు అప్పగించాలని ఆయన కుటుంబ సభ్యులు నిర్ణయించిన విషయం తెలిసిందే. అంత్యక్రియల అనంతరం ఎయిమ్స్‌లోని అనాటమీ విభాగానికి శరీరాన్ని అప్పగించనున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: చాలామంది తమ మరణానంతరం మృతదేహాన్ని ఆస్పత్రులకు అప్పగించాలని కోరుతుంటారు. ఇలా వచ్చిన బాడీలను ఆస్పత్రిలో ఏం చేస్తారన్నది ఆసక్తికరం. కమ్యూనిస్ట్ యోధుడు సీతారాం ఏచూరి భౌతికకాయాన్ని ఢిల్లీ ఎయిమ్స్‌కు అప్పగించాలని ఆయన కుటుంబ సభ్యులు నిర్ణయించిన విషయం తెలిసిందే. అంత్యక్రియల నిమిత్తం ఆయన భౌతికకాయాన్ని ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో ఉంచారు. అంత్యక్రియల అనంతరం ఎయిమ్స్‌లోని అనాటమీ విభాగానికి శరీరాన్ని అప్పగించనున్నారు.


ఏం చేస్తారు

ఒక వ్యక్తి మృతదేహాన్ని ఆసుపత్రికి దానం చేశాక దానిని అనాటమీ విభాగానికి తీసుకువెళతారు. అక్కడ మెడిసిన్ చదువుతున్న విద్యార్థులు మానవ అవయవాల గురించి తెలుసుకుంటారు. అంతకంటే ముందు మృతదేహం ఆసుపత్రికి వచ్చిన వెంటనే దుర్వాసన రాకుండా, చెడిపోకుండా పలు రకాల రసాయనాలు పూస్తారు. మైనస్ 20 డిగ్రీల్లో దేహాన్ని భద్రపరుస్తారు. మృతదేహం అవయవాలను చూపిస్తూ లెక్చరర్లు.. శస్త్రచికిత్సల నైపుణ్యాలను మెడికల్ విద్యార్థులకు బోధిస్తారు. ప్రాక్టీకల్‌‌గా తెలుసుకోవడానికి విద్యార్థులే అవయవాలు కోయడం, సర్జరీ వంటివి చేస్తారు.


ఇలా మెడికల్ విద్యార్థులు శరీర భాగాలన్నింటితో ప్రయోగాలు చేసి వివిధ రకాల చికిత్సల్లో పట్టుసాధిస్తారు. ఇది వైద్య విద్యార్థుల పరిశోధనలో ఒక భాగం. ప్రయోగ సమయంలో శరీరాన్ని పూర్తిగా ఉపయోగించడం అయిపోయాక.. శరీరం నుంచి ఎముకలు తొలగిస్తారు. ముద్దలా మిగిలిన శరీరాన్ని దహనం చేస్తారు. మృతదేహం నుంచి బయటకు తీసిన ఎముకలను కూడా విద్యార్థులు పరిశోధనలకు ఉపయోగిస్తారు. భారత్‌లో వైద్య విద్యార్థుల పరిశోధనల కోసం ఉపయోగించే మృతదేహాలు చాలా కాలంపాటు పాడవకుండా ఉండవు.

For Latest News and National News click here

Updated Date - Sep 14 , 2024 | 09:43 PM

Advertising
Advertising