Manmohan Singh: మన్మోహన్ ముగ్గురు కుమార్తెలు ప్రముఖులే
ABN , Publish Date - Dec 28 , 2024 | 03:07 PM
మన్మోహన్ సింగ్ భార్య గుర్‌శరణ్ కౌర్, ఆయన ముగ్గురు కుమార్తెలు ఉపిందర్, దామన్, అమృత్ తదితరులు దివంగత నేతకు తుది వీడ్కోలు పలికారు.

న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ (Manmohan Singh)కు యావద్దేశ ప్రజలు అంతిమ వీడ్కోలు పలికారు. ఆయన పార్ధివ దేహానికి ప్రభుత్వ లాంఛనాలతో నిగమ్‌బోధ్ ఘాట్‌లో శనివారంనాడు అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. మన్మోహన్ సింగ్ భార్య గుర్‌శరణ్ కౌర్, ఆయన ముగ్గురు కుమార్తెలు ఉపిందర్, దామన్, అమృత్ తదితరులు దివంగత నేతకు తుది వీడ్కోలు పలికారు.
Manmohan Singh: పూర్తైన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు
మన్మోహన్ భార్య గుర్‌శరణ్ కౌర్ అందరికీ చిరపరిచితులే. ప్రొఫెసర్‌గా, రచయితగా, కీర్తనా సింగర్‌గా పేరు తెచ్చుకున్నారు. ముగ్గురు కుమార్తెలు వారివారి రంగాల్లో మంచిపేరు తెచ్చుకున్నారు. మన్మోహన్ పెద్దకుమార్తె పేరు ఉపిందర్ సింగ్. చరిత్రకారణి (హిస్టారియన్)గా, అశోకా యూనివర్శిటీలో ఫ్యాకల్టీ డీన్‌గా ఉన్నారు. "ఎ హిస్టరీ ఆఫ్ ఏన్షియంట్ అండ్ ఎర్లీ మెడివల్ ఇండియా'', ''ది ఏన్షియంట్ ఇండియా'' సహా పలు పుస్తకాలను ఆమె రచించారు. 2009లో సోషల్ సైన్సెస్‌లో ఇన్ఫోసిస్ అవార్డును అందుకున్నారు. పురాతన గ్రీక్ ఫిలాసఫీపై విస్తృత రచనలు చేసిన ప్రముఖ రచయిత విజయ్ టంఖాను ఆమె వివాహం చేసుకున్నారు.
మన్మోహన్ సింగ్ రెండవ కుమార్తె దామన్ సింగ్ రచయిత. ''స్ట్రిక్ట్‌లీ పర్సనల్, ఎ బయోగఫీ ఆఫ్ హెర్ పెరెంట్స్'' సహా పలు పుస్తకాలు రాశారు. సామాజిక అంశాలపై పలు రచనలు చేశారు. ఐపీస్ అధికారి, ఇండియన్ నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ మాజీ సీఈఓ అశోక్ పట్నాయక్‌ను దామన్ వివాహం చేసుకున్నారు. కాగా, మన్మోహన్ ముగ్గురు కుమార్తెల్లో చివరి ఆమె అమృత్ సింగ్. అమెరికాలో మానవ హక్కుల లాయర్‌గా మంచిపేరు తెచ్చుకున్నారు. స్టాన్‌ఫోర్ట్ లా స్కూలులో లా ప్రొఫెసర్‌గా ఉన్నారు. గ్లోబల్ హ్యూమన్ రైట్స్ అంశాలపై కీలక అడ్వకేట్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ప్రఖ్యాత యాలే లా స్కూల్, ఆక్స్‌పోర్ట్, కేంబ్రిడ్జి సహా పలు ప్రతిష్టాత్మక సంస్థల్లో డిగ్రీలు చేశారు.
ఇవి కూడా చదవండి..
National: ఢిల్లీలో అంత్యక్రియలు జరగని మాజీ ప్రధానులు ఎవరో మీకు తెలుసా.. వీరిలో తెలుగు వ్యక్తి కూడా..
Manmohan Singh Funeral: మన్మోహన్ సింగ్ అంతిమ యాత్రలో రాహుల్ గాంధీ ఏం చేశారంటే
Read More National News and Latest Telugu News