ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Lok Sabha Election Result: నేడే ‘లోక్‌సభ’ ఓట్ల లెక్కింపు

ABN, Publish Date - Jun 04 , 2024 | 02:38 AM

కేంద్రంలో అధికార పీఠం ఎవరిదో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. ప్రజలు, రాజకీయ పార్టీల ఉత్కంఠకు తెరపడనుంది. వరసగా మూడోసారి, రికార్డు విజయంపై ప్రధాని మోదీ కన్నేయగా.. ప్రతిపక్ష ఇండీ కూటమి అనూహ్యంగా తామే అధికారంలోకి వస్తామని ధీమాగా ఉంది. ఎగ్జిట్‌ పోల్స్‌ అన్నీ ఏకపక్షంగా కేంద్రంలో మళ్లీ మోదీ సర్కారే వస్తుందని, బీజేపీ హ్యాట్రిక్‌ కొడుతుందని పేర్కొన్న సంగతి తెలిసిందే.

న్యూఢిల్లీ, జూన్‌ 3: కేంద్రంలో అధికార పీఠం ఎవరిదో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. ప్రజలు, రాజకీయ పార్టీల ఉత్కంఠకు తెరపడనుంది. వరసగా మూడోసారి, రికార్డు విజయంపై ప్రధాని మోదీ కన్నేయగా.. ప్రతిపక్ష ఇండీ కూటమి అనూహ్యంగా తామే అధికారంలోకి వస్తామని ధీమాగా ఉంది. ఎగ్జిట్‌ పోల్స్‌ అన్నీ ఏకపక్షంగా కేంద్రంలో మళ్లీ మోదీ సర్కారే వస్తుందని, బీజేపీ హ్యాట్రిక్‌ కొడుతుందని పేర్కొన్న సంగతి తెలిసిందే.

ఈ సారి 400 సీట్లు సాధించాలన్న మోదీ లక్ష్యానికి దగ్గరగా ఎన్డీయే కూటమి సీట్లు సాధిస్తుందని కూడా వెల్లడించాయి. ఇండీ కూటమికి 180 సీట్లలోపే వస్తాయని ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడించాయి. ఈ క్రమంలో అవి ఎగ్జిట్‌ పోల్స్‌ కాదని.. మోదీ మీడియా పోల్స్‌ అని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.

  • లోక్‌సభ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇలా..

  1. నిబంధనల ప్రకారం తొలుత పోస్టల్‌ బ్యాలెట్లను లెక్కిస్తారు.

  2. పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు మొదలైన అరగంట తర్వాతే ఈవీఎంల్లోని ఓట్ల లెక్కింపును మొదలెట్టాల్సి ఉంటుంది.

  3. ఒకవేళ నియోజకవర్గంలో పోస్టల్‌ బ్యాలెట్లు లేకుంటే నిర్దేశించిన సమయానికే ఈవీఎంల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభించాలి.

  4. కంట్రోల్‌ యూనిట్ల నుంచి ఫలితాన్ని నిర్ధారించే ముందు.. పేపర్‌ సీల్‌ చెదిరిపోకుండా చూసుకోవాలి.

  5. అనంతరం మొత్తం పోలైన ఓట్లను, ఫారం 17సీలో పేర్కొన్న సంఖ్యతో సరిపోల్చుకోవాలి.

  6. ఫలితాన్ని తొలుత కౌంటింగ్‌ సూపర్‌వైజర్‌, మైక్రో అబ్జర్వర్‌, కౌంటింగ్‌ ఏజెంట్లకు చూపించాలి.

  7. కంట్రోల్‌ యూనిట్‌లోని డిస్ప్లే ప్యానెల్‌పై ఒకవేళ ఫలితం కనిపించకపోతే, అన్ని యూనిట్ల లెక్కింపు

    పూర్తయిన తర్వాత, ఆయా వీవీ ప్యాట్లలోని స్లిప్పులను లెక్కించాలి.

  8. ప్రతి పోలింగ్‌ స్టేషన్‌కు చెందిన ఫారం 17సీని తుది ఫలితాన్ని కంపైల్‌ చేస్తున్న అధికారికి పంపించాలి.

    ఆయన వాటిని ఫారం 20లో పొందుపరుస్తారు.

  9. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం/లోక్‌సభ పరిధిలోని ఒక్కో సెగ్మెంట్‌ నుంచి ఐదు పోలింగ్‌ స్టేషన్లను ఎంపిక

    చేసుకొని.. ఒక్కో వీవీప్యాట్‌లోని స్లిప్పులను లెక్కించాల్సి ఉంటుంది.

  10. తిరస్కరణకు గురైన పోస్టల్‌ బ్యాలెట్ల సంఖ్య కంటే గెలుపు మార్జిన్‌ తక్కువగా ఉన్నట్లయితే..

    తిరస్కరించిన పోస్టల్‌ బ్యాలెట్లను మళ్లీ పరిశీలించాలి. ఆ తర్వాతే తుది ఫలితం వెల్లడించాలి.

  11. ఇద్దరు అభ్యర్థులకు సమాన ఓట్లు వస్తే డ్రా తీస్తారు.

Updated Date - Jun 04 , 2024 | 05:40 AM

Advertising
Advertising