ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Haryana Assembly Elections 2024: కాంగ్రెస్, బీజేపీ మధ్యలో ఆప్.. చివర నిమిషంలో మారిన రాష్ట్ర రాజకీయం

ABN, Publish Date - Oct 04 , 2024 | 03:59 PM

ఓ వేళ.. హర్యానాలో ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటరు పట్టం కడితే మాత్రం.. మద్యం కుంభకోణం కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కు ఆ రాష్ట్ర ఓటరు క్లీన్ చీట్ ఇచ్చినట్లే అవుతుందని ఓ చర్చ సైతం నడుస్తుంది. ఇంకోవైపు.. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు జస్ట్ కొన్ని గంటల ముందు కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో కాంగ్రెస్ పార్టీని వీడి వయా ఆప్ పార్టీ మీదగా బీజేపీలో అశోక్ తన్వర్ చేరారు. ఆయన మళ్లీ తన సొంత గూటికి అంటే కాంగ్రెస్ పార్టీలో చేరారు.

హర్యానా, అక్టోబర్ 04: హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రేపు అంటే శనివారం జరగనుంది. ఒకే విడతలో జరగనున్న ఈ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే సర్వం సిద్ధం చేసింది. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమిలో మిత్రపక్షాలైన కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు వేర్వేరుగా పోటీ చేస్తున్నాయి. దీంతో ఆయా పార్టీలు.. తమ అభ్యర్థులను ఎన్నికల బరిలో నిలిపాయి. ఇక రాష్ట్రంలో అధికార బీజేపీ సైతం మళ్లీ అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తుంది.


హర్యానాలో కాంగ్రెస్ పార్టీ నుంచి అధికారాన్ని అందుకున్న బీజేపీ.. తన విజయ పరంపరను కొనసాగిస్తు వస్తుంది. మరి ఈ సారి బీజేపీని పక్కకు నెట్టి కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని హస్తగతం చేసుకుంటుందా? లేక ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకుంటుందా? అనే ఓ సందేహం అయితే పోలిటికల్ సర్కిల్‌లో వైరల్ అవుతుంది.


ఎందుకంటే.. ఇప్పటికే ఢిల్లీ, పంజాబ్‌లో పాగా వేసిన కేజ్రీవాల్ పార్టీ హర్యానాపై ఫొకస్ పెట్టింది. అందుకోసం జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలను సైతం ఆ పార్టీ లైట్ తీసుకుంది. అదీకాక ఈ అసెంబ్లీ ఎన్నికలకు జస్ట్ కొద్ది రోజుల ముందు మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దీంతో జైలు నుంచి విడుదలైన ఆయన.. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ క్రమంలో ఆయన ఆ పదవికి రాజీనామా చేశారు. ఇక హర్యానా ఎన్నికల ప్రచారంలో సైతం అరవింద్ కేజ్రీవాల్ పాల్గొన్నారు.


మరోవైపు హర్యానాలో మొత్తం 10 లోక్‌సభ స్థానాలున్నాయి. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్, ఆప్‌లు కలిసి పోటీ చేశాయి. తొమ్మిది స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థులను బరిలో నిలుపగా.. ఆప్ మాత్రం కురుక్షేత్రలో తన అభ్యర్థిని పోటీకి నిలిపింది. ఇక ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చెరి ఐదు స్థానాలను గెలుచుకున్నాయి. ఒకే ఒక్క స్థానంలో పోటీ చేసిన ఆప్ అభ్యర్థి మాత్రం బీజేపీ అభ్యర్థి నవీన్ జిందాల్ చేతిలో ఓటమి పాలయ్యారు. దీంతో ఆ ఎన్నికల్లో ఆప్ తన సత్తా చాట లేకపోయిందని మిత్ర పక్షమైన కాంగ్రెస్ పార్టీ భావించింది.


అందుకే.. తాజాగా జరుగుతున్న ఈ అసెంబ్లీ ఎన్నికల్లో... ఆప్‌తో పొత్తుపై కాంగ్రెస్ పార్టీ మీన మేషాలు లెక్కించింది. అందులోభాగంగా పలుమార్లు ఈ పొత్తుపై చర్చలు జరిపి.. చివరకు మీకు మీరే.. మాకు మేమే అంటూ స్పష్టం చేశాయి. దీంతో ఈ రెండు పార్టీలు విడి విడిగా బరిలో అభ్యర్థులను పోటీకి నిలిపాయి. దాంతో వరుసగా మరోసారి హర్యానాలో బీజేపీ అధికారాన్ని అందుకుంటుందా? లేకుంటే అధికార బీజేపీని పక్కకు నెట్టి.. కాంగ్రెస్ పార్టీ సీఎం కూర్చిని కైవసం చేసుకుంటుందా? అదీ కూడా కాకుంటే.. ఆమ్ ఆద్మీ పార్టీ అధికార పీఠాన్ని హస్తం గతం చేసుకుంటుందా? అనే ఓ చర్చ సైతం పోలిటికల్ సర్కిల్‌లో నడుస్తుంది.


ఓ వేళ.. హర్యానాలో ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటరు పట్టం కడితే మాత్రం.. మద్యం కుంభకోణం కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కు ఆ రాష్ట్ర ఓటరు క్లీన్ చీట్ ఇచ్చినట్లే అవుతుందని ఓ చర్చ సైతం నడుస్తుంది. ఇంకోవైపు.. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు జస్ట్ కొన్ని గంటల ముందు కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో కాంగ్రెస్ పార్టీని వీడి వయా ఆప్ పార్టీ మీదగా బీజేపీలో అశోక్ తన్వర్ చేరారు. ఆయన మళ్లీ తన సొంత గూటికి అంటే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇటువంటి పరిస్థితులు నెలకొన్న వేళ.. మొత్తం 90 స్థానాలున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటరు ఏ పార్టీకి పట్టం కడతాడనేది తెలియలంటే మాత్రం అక్టోబర్ 8వ తేదీ వరకు ఆగాల్సిందే. తప్పదు.

For More National News And Telugu News

Updated Date - Oct 04 , 2024 | 04:08 PM