ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

NDA: కేంద్ర హోంమంత్రి ఎవరు..!?

ABN, Publish Date - Jun 09 , 2024 | 02:51 PM

కేంద్ర హోం శాఖ.. ఈ మినిస్ట్రీ ఎవరికి దక్కుతుంది? అనేది ఇప్పుడు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో కేంద్ర హోంమంత్రిగా అమిత్ షా బాధ్యతలు నిర్వర్తించారు కానీ ఈసారి కంటిన్యూ చేసే పరిస్థితుల్లేవనే తెలుస్తోంది.

ఢిల్లీ: కేంద్ర హోం శాఖ.. ఈ మినిస్ట్రీ ఎవరికి దక్కుతుంది? అనేది ఇప్పుడు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో కేంద్ర హోంమంత్రిగా అమిత్ షా బాధ్యతలు నిర్వర్తించారు కానీ ఈసారి కంటిన్యూ చేసే పరిస్థితుల్లేవనే తెలుస్తోంది. ఆయన్ను మార్చాలని ఎన్డీఏ మిత్రపక్షాల డిమాండ్‌తో బీజేపీ పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

దీంతో.. ఈసారి ఆ బాధ్యతలను చేపట్టేదెవరు? అనేది చర్చనీయాంశం అవుతోంది. ప్రస్తుత పరిస్థితుల్ని బట్టి చూస్తుంటే.. గతంలో రక్షణ మంత్రిగా వ్యహరించిన రాజ్‌నాథ్ సింగ్‌కు కేంద్ర హోంమంత్రిగా ఎంపిక చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. బీజేపీ అధిష్టానం ఆయనకే ఎక్కువ మొగ్గు చూపుతున్నట్టు వార్తలొస్తున్నాయి.


ఒకవేళ రాజ్‌నాథ్ సింగ్‌కు కాకపోతే.. నితిన్ గడ్కరీకి ఆ శాఖ అప్పగించే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. గతంలో రోడ్డు రవాణా & హైవేస్ మంత్రిగా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. ఆ హోదాలో తాను సమర్థవంతంగా తన పని నిర్వర్తించడంతో.. ఆయన పనితనానికి గాను జాతీయంగా మంచి పేరు వచ్చింది.

ఈ క్రమంలోనే హోంమంత్రిగా ఆయన పేరుని సిఫార్సు చేసినట్లు సమాచారం అందుతోంది. అయితే.. దీనిపై ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ ఈ ఇద్దరు కాకపోతే.. ఈ మూడో వ్యక్తి ఎవరై ఉంటారన్నది రాజకీయ వర్గాల్లో మాట్లాడుకుంటున్నారు. ఫైనల్‌గా ఈ పదవి ఎవర్ని వరించనుంది..? అనేది ఇవాళ్టి సాయంత్రంతో క్లారిటీ రానుంది.

Read more!

Updated Date - Jun 09 , 2024 | 02:51 PM

Advertising
Advertising