మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

LokSabha Elections: దక్షిణాదిలో పాగా వేస్తాం

ABN, Publish Date - Apr 11 , 2024 | 02:17 PM

ఆంద్రప్రదేశ్‌లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిదే అధికారమని కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు సీటీ రవి స్పష్టం చేశారు. ఈ లోక్‌సభ ఎన్నికల వేళ దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేసేందుకు తమ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుందని చెప్పారు.

LokSabha Elections: దక్షిణాదిలో పాగా వేస్తాం
CT Ravi

బెంగళూరు, ఏప్రిల్ 11: ఆంద్రప్రదేశ్‌లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిదే అధికారమని కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు సీటీ రవి (CT Ravi) స్పష్టం చేశారు. ఈ లోక్‌సభ ఎన్నికల (LokSabha Elections 2024)వేళ దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేసేందుకు తమ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుందని చెప్పారు.

Abhishek Banerjee: అమిత్ షా బెంగాల్‌కి రండి.. అభిషేక్ సవాల్

తమిళనాడులో తమ పార్టీకి ఎక్కువ ఓట్లుతోపాటు అధిక సీట్లు వస్తాయని ఈ సందర్భంగా ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కేరళలో లోక్‌సభ స్థానాలు గెలుచుకోవడం ద్వారా ఆ రాష్ట్రంలో తమ పార్టీ ఖాతా తెరుస్తుందన్నారు. ఇక తెలంగాణలో మాత్రం తమ పార్టీ అత్యధిక లోక్‌సభ స్థానాలు గెలుచుకొని అగ్రస్థానంలో నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

Rains: సమయానికి ముందే వచ్చేస్తున్నాయ్.. భారీ వర్షాలు కురిపించేస్తాయ్..

అయితే గతేడాది జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఓటమి పాలైందంటే.. అందులో తమ తప్పిదం ఉందన్నారు. తమ పార్టీ తీసుకున్న కొన్ని నిర్ణయాల కారణంగా.. ప్రభుత్వానికి ప్రతికూల వాతవరణం ఏర్పడిందని చెప్పారు. దాంతో తమ పార్టీపై ప్రజల్లో విశ్వసనీయత దెబ్బ తిందని తెలిపారు.


అందువల్లే ఆ ఓడిపోయామన్నారు. అయితే ఈ లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలో బీజేపీ, జేడీఎస్ కలిసి పోటీ చేస్తున్నాయని వివరించారు. అందులోభాగంగా అధికార కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వెళ్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ముచ్చటగా మూడోసారి కూడా మోదీ విజయం సాధిస్తారన్నారు.

Veerappan: వీరప్పన్‌ కుమార్తె ఎన్టీకే అభ్యర్థి.. భార్య డీఎంకేకు మద్దతుగా ప్రచారం

మోదీ ప్రభుత్వం తీసుకు వచ్చిన విధానాలు, ఆయన బలమైన నాయకత్వాన్ని ప్రజలు మరోసారి కొరుకుంటున్నారని తెలిపారు. అయితే ప్రధానిగా ఇందిరా గాంధీ గరీబీ హాఠావో అంటూ గతంలో పిలుపునిచ్చిందని గుర్తు చేశారు. అయితే ఆ నినాదంతో ఆ పార్టీలోని వారిలో పేదరికం పోయిందని ఈ సందర్భంగా సీటీ రవి వ్యంగ్యంగా అన్నారు.

High Court:11 జిల్లాల్లో రామనవమి యాత్రను అనుమతించం..

ఆ క్రమంలో పేద ప్రజలు దోపిడికి గురయ్యారన్నారు. అయితే 140 కోట్ల ప్రజలు మరోసారి మోదీ ప్రభుత్వం ఏర్పాటు కావాలని నిర్ణయించారని సీటీ రవి ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.

జాతీయ వార్తలు కోసం..

Updated Date - Apr 11 , 2024 | 03:12 PM

Advertising
Advertising