ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hardeep Singh Puri: పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గనున్నాయా? కేంద్రమంత్రి కీలక ప్రకటన

ABN, Publish Date - Sep 28 , 2024 | 08:09 AM

పెట్రోల్, డీజిల్ ధరలు జీఎస్టీ పరిధిలోకి తీసుకు రావాలని దేశవ్యాప్తంగా డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. కానీ దీనిపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. ఈ నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం, సహాజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి కీలక వ్యాఖ్యలు చేశారు.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28: పెట్రోల్, డీజిల్ ధరలు జీఎస్టీ పరిధిలోకి తీసుకు రావాలని చాలా కాలంగా ఓ డిమాండ్ అయితే వినిపిస్తుంది. అయితే ఈ అంశంపై మోదీ ప్రభుత్వం మాత్రం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అలాంటి వేళ.. కేంద్ర పెట్రోలియం, సహాజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి కీలక వ్యాఖ్యలు చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలు జీఎస్టీ పరిధిలోకి తీసుకు రావడంలో ఏకభిప్రాయం సాధించాలని ఆయన రాష్ట్రాలకు పిలుపునిచ్చారు.


పుణే ఇంటర్నేషనల్ సెంటర్‌ 14వ వ్యవస్థాపక దినోత్సవం సందర్బంగా రాబోయే దశాబ్దంలో భారతదేశం యొక్క ఇంధన భద్రతను పెంపొందించడానికి వ్యూహం మరియు చర్యలు" అనే అంశంపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి కీలకోపన్యాసం చేశారు. వీటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకు రావాలని చాలా కాలంగా ఓ డిమాండ్ అయితే ఉందన్నారు. ఇదే విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రితో వివిధ సందర్భాల్లో ప్రస్తావించినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం దేశ జనాభా 1.4 మిలియన్లకు చేరిందన్నారు. దీంతో ఇంధనం వాడకం సైతం మూడింతలు పెరిగిందని చెప్పారు.


రాబోయే రెండు దశాబ్దాల్లో ప్రపంచంలోనే 25 శాతం ఇంధనాన్ని భారత్ వినియోగించనుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ జీఎస్టీ పరిధిలోకి తీసుకు వచ్చేందుకు దేశంలోని అన్ని రాష్ట్రాలు ఒక తాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఆ క్రమంలో కేంద్రం సైతం సహకారం అందించేందుకు సిద్దంగా ఉందని స్పష్టం చేశారు.


అయితే ఇదే అంశాన్ని జీఎస్టీ కౌన్సిల్‌లో చర్చించాలని గతంలో కేరళ హైకోర్టు స్పష్టం చేసిందని తెలిపారు. కానీ ఈ సమావేశంలో చర్చించేందుకు ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి మాత్రం సుముఖత వ్యక్తం చేయలేదని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి గుర్తు చేశారు. మరోవైపు వ్యాట్‌ను వదులుకోవడానికి బీజేపీ యేతర పాలిత రాష్ట్రాలు సిద్దంగా లేవన్నారు.


అదీకాక రాష్ట్రాలకు మద్యం, ఇంధనం ప్రధాన ఆదాయ వనరుగా ఉందని తెలిపారు. అలాంటి వేళ.. ఇంధనాన్ని జీఎస్టీ పరధిలోకి తీసుకు వచ్చేందుకు పలు రాష్ట్రాలు సంసిద్ధత వ్యక్తం చేయక పోవచ్చునని కేంద్ర పెట్రోలియం, సహాజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇంధన దిగుమతి చేసుకోని.. పునరుత్పాదక ఇంధన కార్యక్రమాల్లో ముందుకు వెళ్లాల్సిన ప్రాముఖ్యత ఉందని పూణే ఇంటర్నేషనల్ సెంటర్ అధ్యక్షుడు డాక్టర్ రఘునాథ్ మషేల్కర్ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.

For National News And Telugu News..

Updated Date - Sep 28 , 2024 | 08:10 AM