Madhya Pradesh: వొద్దంటే వెళ్లిపోతా.. కమల్ నాథ్ షాకింగ్ కామెంట్స్..
ABN, Publish Date - Feb 29 , 2024 | 10:31 AM
Madhya Pradesh: ఓవైపు బీజేపీలో(BJP) చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతున్న వేళ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్(Kamal Nath) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మీరు కోరుకుంటే తప్పుకుంటా’ అంటూ కార్యకర్తల సమావేశంలో అన్నారు కమల్‌నాథ్. మధ్యప్రదేశ్(Madhya Pradesh) లోని తన స్వస్థలమైన చింద్వారాలోని(Chhindwara) హరాయ్‌లో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో కమల్‌నాథ్ మాట్లాడారు.
Madhya Pradesh: ఓవైపు బీజేపీలో(BJP) చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతున్న వేళ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్(Kamal Nath) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మీరు కోరుకుంటే తప్పుకుంటా’ అంటూ కార్యకర్తల సమావేశంలో అన్నారు కమల్‌నాథ్. మధ్యప్రదేశ్(Madhya Pradesh) లోని తన స్వస్థలమైన చింద్వారాలోని(Chhindwara) హరాయ్‌లో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో కమల్‌నాథ్ మాట్లాడారు. ‘చాలా సంవత్సరాలు ఇక్కడ ప్రజల ప్రేమను, విశ్వాసాన్ని పొందుతున్నాను. కమల్‌నాథ్‌కు వీడ్కోలు పలకాలనుకుంటే అది మీ ఇష్టం. నేను వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. నా అంతట నేను తప్పుకోవడానికి సిద్ధంగా లేదు. అది మీ ఇష్టం.’ అని అన్నారు.
కమల్‌నాథ్ కుమారుడు నకుల్ నాథ్ చింద్వారా లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ స్థానం నుంచి నకులు మరోసారి పోటీ చేస్తారని స్పష్టం చేశారు కమల్‌నాథ్. చింద్వారా అసెంబ్లీ నియోజకవర్గానికి కమల్‌నాథ్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే, ఈ నియోజకవర్గంలో బీజేపీ కాస్త పుంజుకుంటోంది. దీంతో.. కార్యకర్తల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు కమల్‌నాథ్. కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరూ భయపడాల్సిన పని లేదన్నారు. భవిష్యత్‌ను కాపాడుకోవడం కోసం అందరూ కాంగ్రెస్‌కు ఓటు వేయాలన్నారు.
అయోధ్య బీజేపీది కాదు.. అందరిది..
అయోధ్యలో రామ మందిరం అందరికీ చెందుతుందని స్పష్టం చేశారు కమల్‌నాథ్. అయోధ్య నిర్మాణం క్రెడిట్ బీజేపీకి ఏమాత్రం చెందదని అన్నారు. అయోధ్య రామ మందిరం తనతో సహా దేశ ప్రజలందరికీ చెందుతుందన్నారు. సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని.. గుడిని ప్రజల సొమ్ముతో నిర్మించారని అన్నారు. తానూ శ్రీరాముని పూజిస్తానని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. చింద్వారాలో తనకు చెందిన భూమిలో హనుమంతుడికి ఆలయం కట్టించానని చెప్పారు.
బీజేపీలో చేరికపై క్లారిటీ..
గత కొంత కాలంలో తాను బీజేపీలో చేరబోతున్నట్లు వస్తున్న వార్తలను కమల్‌నాథ్ తీవ్రంగా ఖండించారు. అదంతా మీడియా సృష్టి అని కొట్టిపారేశారు. మీడియాలో మాత్రమే ఇలాంటి కథనాలు వస్తున్నాయని, బయట ఎవరూ అలా అనడం లేదన్నారు. ఈ విషయంలో మీడియా ఏమైనా తనను సంప్రదించిందా? అని ప్రశ్నించారు. ఇలాంటి ప్రసారం చేసే ముందు తనను సంప్రదించాలని సూచించారు కమల్‌నాథ్.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
Updated Date - Feb 29 , 2024 | 10:31 AM