ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Manish Kashyap: కాషాయం కుండువా కప్పుకున్న కశ్యప్

ABN, Publish Date - Apr 25 , 2024 | 04:27 PM

బిహార్ యూట్యూబర్ మనీష్ కశ్యప్ గురువారం బీజేపీలో చేరారు. ఢిల్లీ ఎంపీ మనోజ్ తీవారి సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు. అనంతరం మనీష్ కశ్యప్ మాట్లాడుతూ.. మనోజ్ తీవారి వల్లే తాను జైలు నుంచి బయటకు రాగలిగానని తెలిపారు.

Manish Kashyap

న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: బిహార్ యూట్యూబర్ మనీష్ కశ్యప్ గురువారం బీజేపీలో చేరారు. ఢిల్లీ ఎంపీ మనోజ్ తీవారి సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు. అనంతరం మనీష్ కశ్యప్ మాట్లాడుతూ.. మనోజ్ తీవారి వల్లే తాను జైలు నుంచి బయటకు రాగలిగానని తెలిపారు.

Arvind Kejriwal: ఎన్నికల ప్రచారానికి సునీత..!

ప్రధాని నరేంద్ర మోదీకి తన తల్లి పెద్ద అభిమాని అని చెప్పారు. ఆ క్రమంలో ఆమె సలహా మేరకు తాను బీజేపీలో చేరినట్లు మనీష్ కశ్యప్ వివరించారు. బిహార్‌లో బీజేపీ బలపడేందుకు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. అయితే బిహార్‌ రాష్ట్రాన్ని లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం దోచేసిందని ఆరోపించారు. ఆ కుటుంబం రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసిందని మండిపడ్డారు.

Delhi: లోక్‌సభ రెండో విడత బరిలో కీలక నేతలు.. ఎవరెవరంటే

అయితే బిహార్‌లోని కొన్ని రాజకీయ పార్టీల్లో చేరాలంటే మాత్రం సూట్ కేసులతో నగదు తీసుకు వెళ్లాల్సి ఉందని ఆరోపించారు. కానీ భారతీయ జనతా పార్టీలో అలా కాదన్నారు. ఈ పార్టీ పేద కుటుంబానికి చెందిన తన లాంటి వారిని సైతం గౌరవం ఇస్తుందన్నారు. మహిళ, తల్లి, యూట్యూబర్‌లకు బీజేపీ తగిన గౌరవం ఇస్తుందని తెలిపారు.


ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ బీజేపీ అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. బీజేపీలో జాతీయ భావంతో తాను పని చేస్తానని ఈ సందర్బంగా స్పష్టం చేశారు. అయితే తాను జైల్లో ఉన్న సమయంలో పలు పార్టీలు తనపై ఆరోపణలు గుప్పించాయని చెప్పారు ఆ సమయంలో తనకు బీజేపీ నాయకులు ఇచ్చిన మద్దతు అంతా ఇంతా కాదన్నారు. ఈ రోజు సురక్షితంగా జైలు నుంచి బయటకు వచ్చానంటే.. అందుకు తన తల్లి ఆశీర్వాదంతోపాటు బీజేపీ నాయకుల మద్దతు కూడా ఉందన్నారు.

Odisha: ఓ వైపు అసెంబ్లీ ఎన్నికలు: మరోవైపు ఎదురు కాల్పులు

తమిళనాడులో బిహార్‌ నుంచి వలస వచ్చిన వారిపై స్థానికులు దాడులు చేస్తున్నట్లు మనీష్ కశ్యప్ ఓ నకిలీ వీడియోని సృష్టించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాంతో 2023, మార్చిలో మనీష్ కశ్యప్‌ను పోలీసులు అరెస్ట్ చేసి.. తమిళనాడుకు తరలించారు. దీంతో కొన్ని నెలలపాటు మధురై జైల్లో ఉన్నారు. అనంతరం అతడిని బిహార్ జైలుకు తరలించారు.

MLC Election: తెలంగాణలో మరో ఎన్నిక.. షెడ్యూల్ విడుదల

ఆ తర్వాత 2023, డిసెంబర్‌లో మనీష్ కశ్యప్ జైలు నుంచి విడుదలయ్యాడు. అయితే అతడి వీడియోలతో.. అటు తమిళనాడు, ఇటు బిహార్‌లలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్ స్పందించారు. ఇటువంటి పుకార్లను నమ్మవద్దంటూ.. బిహారీలకు సూచించారు. బిహార్‌కు చెందిన మనీష్ కశ్యప్.. ప్రముఖ యూట్యూబర్. మనీష్ కశ్యప్ సన్ ఆఫ్ బిహార్ పేరు మీద ఓ యూట్యూబ్ చానెల్ ప్రారంభించాడు. అనతి కాలంలోనే ఈ యూట్యూబ్ చానెల్ ప్రజలను ఆకట్టుకుంది. అతడి వీడియో చానెల్‌‌కు 8.75 మిలియన్ల మంది సబ్ స్క్రైబర్స్ ఉన్నారు.

Read National News and Telugu News

Updated Date - Apr 25 , 2024 | 04:34 PM

Advertising
Advertising