ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Actor Upendra : నాకు నేనంటేనే ఇష్టం

ABN, Publish Date - Jun 16 , 2024 | 02:07 AM

నేను భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించను. అసిస్టెంట్‌ డైరక్టర్‌గా నా వృత్తి జీవితాన్ని ప్రారంభించినప్పుడు- సమాజానికి ఏదో ఒకటి చేయాలనుకొనేవాణ్ణి. అదొక కోణం. కానీ నేను ఎప్పుడూ రియాలిటీలోనే బతుకుతూ ఉంటా. అయితే ఏదో చేయాలనే తపన మాత్రం నన్ను వెంటాడుతూ ఉంటుంది.

సండే సెలబ్రిటీ

దక్షిణాది రాష్ట్రాల సీనీ పరిశ్రమలపై తనదైన ముద్ర వేసిన వారిలో కన్నడ నటుడు ఉపేంద్ర

ఒకరు. విలక్షణమైన శైలితో ప్రేక్షకులను ఆకట్టుకొనే ఉపేంద్ర ‘నవ్య’కు ఇచ్చిన ప్రత్యేక

ఇంటర్వ్యూ.

నేను భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించను. అసిస్టెంట్‌ డైరక్టర్‌గా నా వృత్తి జీవితాన్ని ప్రారంభించినప్పుడు- సమాజానికి ఏదో ఒకటి చేయాలనుకొనేవాణ్ణి. అదొక కోణం. కానీ నేను ఎప్పుడూ రియాలిటీలోనే బతుకుతూ ఉంటా. అయితే ఏదో చేయాలనే తపన మాత్రం నన్ను వెంటాడుతూ ఉంటుంది. ‘‘రాజకీయాలు కలుషితం కాకూడదు.. దానిలో డబ్బు ప్రభావం ఎక్కువ ఉండకూడదు. అవినీతి ఉండకూడదు సమస్యలే ప్రధాన అంశాలుగా ఎన్నికలు జరగాలి. ‘రైట్‌ టూ రీకాల్‌’ అమలు చేయాలి’’ ఇలా అనేక ఆలోచనలు ఉంటాయి. పవన్‌ కళ్యాణ్‌గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత- నన్ను రాజకీయాల్లోకి రమ్మని మా దగ్గర అనేకమంది అడిగారు. ఆయనకు నాకు తేడా ఉంది. ఆయనకు ఒకటే లక్ష్యం, ఆదర్శం. కానీ నా పరిస్థితి వేరు.

మీరు నటుడు, దర్శకుడు. ఈ రెండింటిలో మీకు ఏది ఎక్కువ ఇష్టం?

రెండూ ఇష్టమే! అంత కన్నా సినిమా నిర్మాణమంటేనే ఇష్టం. డైరక్షన్‌ అంటే... ఒక సినిమాను మన ఆలోచనల నుంచి పుట్టించటం. దాని థ్రిల్లే వేరు. కానీ నటన మరో సముద్రం. డైరక్టర్‌ చెప్పినట్లు చేయాలి. నా ఉద్దేశంలో నటన కన్నా డైరక్షన్‌ ఎక్కువ థ్రిల్‌ ఇస్తుంది. అందుకే నేను రెండింటిలోనూ కొనసాగుతున్నా! ఐదేళ్లకు ఒకసారి డైరక్షన్‌ చేస్తూ ఉంటా!

మీరు నటించేటప్పుడు డైరెక్టర్‌లా ఆలోచిస్తారా?

నా ఉద్దేశంలో డైరక్టర్‌ చెప్పినట్లు నటుడు చేయాలి. నేను ‘హెచ్‌టూఓ’ అనే సినిమా చేసే సమయంలో ఏఎన్నాఆర్‌గారిని - ‘ప్రకృతి’ అనే ఒక పాత్ర చేయమని అడగటానికి వెళ్లా.. కథ చెప్పా. ఆయనకు బాగా నచ్చింది. ఆ క్యారెక్టర్‌ ఎలా ఉండాలో నాకు చెబుతూ ఆయన ఊహాల్లోకి వెళ్లిపోయారు. తెల్ల గెడ్డం, తెల్లటి దుస్తులు, వెనుక కాంతి,అందమైన ప్రకృతి... ఇలా ఆ పాత్ర ఎలా ఉండాలో చాలాసేపు చెప్పారు. అయితే ఆయనకు అవుట్‌డోర్‌ షూటింగ్‌ చేసే ఓపిక లేదు. అందువల్ల ఆ పాత్ర చేయలేనన్నారు. ఆ సందర్భంలో- ఆయన కొన్ని గొప్ప మాటలు చెప్పారు. ‘‘ నటుడిగా నాకు ఒక ప్రిన్సిపల్‌ ఉంది. నేను ఫిల్మ్‌ ఒప్పుకొనేముందు కింగ్‌లా ప్రవర్తిస్తా. నాకు కావాల్సివన్నీ అడుగుతా. ఎక్కడా రాజీ పడను. పూర్తిగా తృప్తి చెందితేనే సినిమా ఒప్పుకుంటా. అయితే ఒక్కసారి ఒప్పుకున్న తర్వాత నేను బానిసలా పనిచేస్తా...’’ అని అన్నారు. పరిశ్రమలో వారందరూ నేర్చుకోవాల్సిన విషయమది. ఆ మాటల్లోనే- ఆయన ఇంకో విషయం కూడా చెప్పారు. ‘‘గతంలో నా దగ్గరకు ఏదైనా మంచి స్ర్కిప్ట్‌ వస్తే- అది నాకన్నా ఎన్టీఆర్‌కు బావుంటుందని అనిపిస్తే- దాన్ని ఆయన దగ్గరకు పంపేవాణ్ణి.. నేనే ఫోన్‌ చేసి స్వయంగా చెప్పేవాణ్ణి. ఆయన కూడా అలా చేసేవారు’’ అని అన్నారు. అందరూ వాళ్లిద్దరి మాదిరిగా ఉంటే చాలా బావుంటుందనిపిస్తుంది.

మీకు నటన అనేది సహజంగా వచ్చిందా? ఎక్కడైనా నేర్చుకున్నారా?

ఎక్కడా నేర్చుకోలేదు. ఎక్కడినుంచి వచ్చిందో నాకు తెలియదు. ఇక్కడ ఒక్క విషయం మీకు చెప్పాలి. నేను వేరే చిత్రాలను లేదా నటులను చూసి స్పూర్తి పొందను. ఇతరులు ఎవరూ చెప్పని సబ్జెక్ట్‌ను చెప్పాలని ప్రయత్నిస్తాను.


కొవిడ్‌ తర్వాత... ఓటీటీ ఫ్లాట్‌ఫాంల ప్రవేశం తర్వాత సినిమా లాంగ్వేజ్‌లో మార్పు వచ్చిందా?

వచ్చింది. అయితే ఇది సహజమే! నేను సినీ రంగంలోకి ప్రవేశించిన కొత్తలో బడ్జెట్‌లు చాలా తక్కువ ఉండేవి. ఆ బడ్జెట్‌లోనే అందరినీ ఆకర్షించే సినిమాలు చేయాలని ప్రయత్నించేవాళ్లం. ఇప్పుడు కూడా అంతే! కొత్త దర్శకులు తమ సత్తా చూపించాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో పోటీ పెరిగింది. మార్కెట్‌ పెరిగింది. సమస్యలు పెరిగాయి. అన్నీ పెరుగుతూ వచ్చాయి. ఇవన్నీ కూడా సహజమైనవే!

మీరు ట్రెండ్‌ సెట్టరా? ట్రెండ్‌ను ఫాలో అవుతారా?

నా వరకూ ఒక ట్రెండ్‌ను మొదలుపెట్టాలనుకుంటా. నేను నిజాయితీగా నాకు నచ్చినట్లు సినిమా తీస్తా. ఒక సినిమా హిట్‌ అయింది కాబట్టి ఆ తరహాలో తీయాలని ప్రయత్నించను. నా ఉద్దేశంలో సినిమాల విజయానికి ఒక ఫార్ములా లేదు. నిజాయితీగా... మనకు నచ్చిన సినిమా తీయటమే అసలైన ఫార్ములా!

మీ ఉద్దేశంలో విజయవంతమైన సినిమాల వెనకున్న ఫార్ములాలు ఏమిటి?

‘వయస్సు అయిపోయింది కాబట్టి ఫిలాసఫీ చెబుతున్నాడు’ అని మీరు అనుకోవచ్చు కానీ సినిమాలన్నీ కాలమాన పరిస్థితుల మీద ఆధారపడి ఉంటాయనిపిస్తుంది. ఒక్కసారి నా సినిమాలనే తిరిగి చూసుకుంటే- ‘ఏ’, ‘ఉపేంద్ర’, ‘సూపర్‌’ లాంటి సినిమాలు ఎలా చేశాను? అనిపిస్తుంది. స్టుపిడిటీ అనిపిస్తుంది. కానీ ఆ పరిస్థితుల్లో చేశానంతే! మీకో ఉదాహరణ చెబుతాను. ప్రస్తుతం మొబైల్‌ ఫోన్లు అందరి దగ్గరా ఉన్నాయి. మొబైల్‌ను నేనే ఆవిష్కరించానని ఒక శాస్త్రవేత్త చెప్పుకున్నాడనుకుందాం. నా ఉద్దేశంలో అది సత్యం కాదు. జనాభా పెరిగిపోయింది. ప్రజల మధ్య కమ్యూనికేషన్‌కు ఒక సమర్థమైన సాధనం కావాలి. దీని కోసం ప్రకృతే మొబైల్‌ ఫోన్‌ అనే సాధనాన్ని కనుగొనేలా చేసింది. మనం కేవలం టూల్స్‌ మాత్రమే!

ప్రస్తుత కన్నడ సినిమా పరిశ్రమ మీద మీ అభిప్రాయమేమిటి?

బాగా ఎదుగుతోంది. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. పరిస్థితులకు అనుగుణంగా ప్రతి ఇండస్ట్రీ మారుతూ ఉంటుంది. ఒక భాషకు చెందిన సినిమా దేశవ్యాప్తంగా పెద్ద హిట్‌ అయిన వెంటనే- మిగిలిన వారందరూ - ఆ సినిమా వైపు చూస్తారు. కొద్ది కాలం తర్వాత మరో భాష సినిమా హిట్‌ అవుతుంది. ఇదంతా ఒక చక్రం.

మీకు ఇష్టమైన నటులు ఎవరు?

వాస్తవం చెప్పమంటారా... నాకు నేనంటేనే ఇష్టం. నేను కాకుండా- చిరంజీవిగారు, విష్ణువర్థన్‌గారు, రజనీగారు... వాళ్లన్నా ఇష్టమే! ఎందుకంటే ప్రజలు వారిని అంతగా ఆదరించారంటే - వాళ్లలో ఏదో ఉన్నట్లే కదా!

-సీవీఎల్‌ఎన్‌ ప్రసాద్‌

Updated Date - Jun 16 , 2024 | 02:08 AM

Advertising
Advertising