ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Cancer Care: బయాప్సీ భయం వద్దు

ABN, Publish Date - Sep 10 , 2024 | 04:58 AM

కేన్సర్‌ చికిత్స గురించి ఎన్నో అపోహలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో ప్రధానమైనది ‘బయాప్సీ’. కేన్సర్‌ ట్యూమర్‌ నుంచి ముక్క తీసి పరీక్షిస్తే, మిగతా అవయవాలకు కేన్సర్‌ వ్యాపించే ముప్పు ఉంటుందన్నది అపోహ మాత్రమేననీ, సమర్థమైన కేన్సర్‌ చికిత్సకు బయాప్సీ తోడ్పడుతుందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.

కేన్సర్‌ కేర్‌

కేన్సర్‌ చికిత్స గురించి ఎన్నో అపోహలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో ప్రధానమైనది ‘బయాప్సీ’. కేన్సర్‌ ట్యూమర్‌ నుంచి ముక్క తీసి పరీక్షిస్తే, మిగతా అవయవాలకు కేన్సర్‌ వ్యాపించే ముప్పు ఉంటుందన్నది అపోహ మాత్రమేననీ, సమర్థమైన కేన్సర్‌ చికిత్సకు బయాప్సీ తోడ్పడుతుందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.

బయాప్సీ సమయంలో కేన్సర్‌ కణితి నుంచి చిన్న కణజాలాన్ని సేకరించి, మైక్రోస్కోప్‌ కింద పరీక్షించి, అది కేన్సర్‌ అవునో, కాదో నిర్థారిస్తారు. ఈ ప్రక్రియ ఎంతో సురక్షితమైనది, చిన్న కోతతో పూర్తయిపోతుంది. పరీక్షలో భాగంగా కణితి దగ్గరకు చేరుకుని, సూదితో గుచ్చి లేదా కోసి చిన్న ముక్కను సేకరిస్తారు కాబట్టి, అలా చేయడం వల్లే కేన్సర్‌ వ్యాపిస్తుందనే అపోహ సర్వత్రా స్థిరపడిపోయింది.

యాప్సీ భయంతో కేన్సర్‌ చికిత్సను వాయుదా వేసే వాళ్లున్నారు. ఆ పరీక్షతో, పక్కనున్న అవయవాలకు కేన్సర్‌ వ్యాపిస్తుందనే భయంతో బయాప్సీతో పని లేని చికిత్సను ఆశ్రయించే వాళ్లూ ఉన్నారు. అయితే బయాప్సీ గురించి సరైన అవగాహన లోపించడం వల్లే ఈ భయాలు పెరిగిపోతున్నాయి. బయాప్సీ అంటే ఏంటి? ఎందుకు చేస్తారు? ఆ పరీక్షతో ఉపయోగాలేంటో తెలుసుకుంటే, బయాప్సీ చుట్టూ ఆవరించి ఉన్న భయాలు, అపోహలన్నీ అర్థం లేనివనే విషయం తెలిసిపోతుంది. అన్నిటికంటే ముందు బయాప్సీ గురించి తెలుసుకుందాం!


  • బయాప్సీ అంటే?

బయాప్సీ సమయంలో కేన్సర్‌ కణితి నుంచి చిన్న కణజాలాన్ని సేకరించి, మైక్రోస్కోప్‌ కింద పరీక్షించి, అది కేన్సర్‌ అవునో, కాదో నిర్థారిస్తారు. ఈ ప్రక్రియ ఎంతో సురక్షితమైనది, చిన్న కోతతో పూర్తయిపోతుంది. పరీక్షలో భాగంగా కణితి దగ్గరకు చేరుకుని, సూదితో గుచ్చి లేదా కోసి చిన్న ముక్కను సేకరిస్తారు కాబట్టి, అలా చేయడం వల్లే కేన్సర్‌ వ్యాపిస్తుందనే అపోహ సర్వత్రా స్థిరపడిపోయింది. కణితిని ఇలా కదిలించడం వల్ల దాన్లోని కేన్సర్‌ కణాలు ఇతర శరీర అవయవాలకు విస్తరిస్తాయనే నమ్మకం పెరిగిపోయింది. కానీ బయాప్సీలతో కేన్సర్‌ వ్యాపిస్తుందనే శాస్త్రీయ ఆధారాలేవీ లేవు. నిజానికి బయాప్సీలు కేన్సర్‌ మెటాస్టాసిస్‌ (ప్రధాన కణితి నుంచి శరీరంలోని ఇతర అవయవాలకు కేన్సర్‌ వ్యాపించడం) ముప్పును పెంచవని అధ్యయనాల్లో వెల్లడైంది. రొమ్ము కేన్సర్‌ పెరుగుదల లేదా వ్యాప్తి మీద బయాప్సీ ప్రభావం ఏమాత్రం ఉండదనే పరిశోధకుల అధ్యయనాలు జోర్నల్‌ ఆఫ్‌ క్లినికల్‌ ఆంకాలజీలో ప్రచురితమయ్యాయి. అదే విధంగా, ఊపిరితిత్తుల ట్యూమర్ల బయాప్సీలు కేన్సర్‌ వ్యాప్తికి దోహదపడవనే మరొక అధ్యయనం కూడా జోర్సల్‌ ఆఫ్‌ అమెరికన్‌ మెడికల్‌ అసోసియేషన్‌లో ప్రచురితమైంది.


  • బయాప్సీ ఎందుకు?

కచ్చితమైన వ్యాధి నిర్థారణకూ, చికిత్స ప్లానింగ్‌కూ బయాప్సీలు అత్యవసరం. మైక్రోస్కోప్‌ కింద కణజాల నమూనాను పరిశీలించడం ద్వారా, కేన్సర్‌ రకం, దశ, తత్వాలను కనిపెట్టవచ్చు. నిర్దిష్ట లక్షణాలు కలిగిన కేన్సర్‌కు తగిన ప్రభావవంతమైన చికిత్సా ప్రణాళికను రూపొందించడానికి ఈ సమాచారం కీలకం. బయాప్సీ చేయనప్పుడు, తగిన సమాచారం వైద్యుల దగ్గర ఉండదు. కాబట్టి వైద్యులు కేన్సర్‌ చికిత్సకు సంబంధించిన కచ్చితమైన నిర్ణయాలనుతీసుకోలేరు. నిజానికి కొన్ని కేసుల్లో బయాప్సీలు కణితికి

సంబంధించిన విలువైన సమాచారాన్ని అందించి, కేన్సర్‌ వ్యాప్తిని అరికట్టడానికి కూడా తోడ్పడతాయి. ఉదాహరణకు, కణితి చుట్టుపక్కల కణజాలాలకు వ్యాపించకుండా, ఒక ప్రదేశానికే పరిమితమై ఉందనే విషయం బయాప్సీలో బహిర్గతమైతే, వైద్యులు సర్జరీ ద్వారా ఆ కణితిని సమూలంగా తొలగించగలుగుతారు. దాంతో కేన్సర్‌ శరీరంలోని ఇతర అవయవాలకు వ్యాపించకుండా ఉండడమే కాకుండా, రోగి వ్యాధి నుంచి త్వరగా కోలుకునే అవకాశాలు కూడా పెరుగుతాయి.

బయాప్సీలతో కేన్సర్‌ వ్యాప్తి చెందుతుందనడానికి ఆధారాలు లేకపోయినప్పటికీ, కొందరు రోగుల్లో ఈ నమ్మకం లోతుగా నాటుకుపోయింది. దాంతో అనవసరపు ఆందోళన, భయాలు పెరిగి, వ్యాధి నిర్థారణ, చికిత్సలు ఆలస్యమవుతున్నాయి. రోగుల్లో బయాప్సీకి సంబంధించి ఎలాంటి భయాలు, అందోళనలు, అనుమానాలున్నా, వాటిని వైద్యులను అడిగి నివృత్తి చేసుకోవాలి. ఈ భయాలను పోగొట్టి, సురక్షితమైన, లాభదాయకమైన బయాప్సీ గురించిన కచ్చితమైన సమాచారాన్ని వైద్యులు అందించడం ద్వారా రోగులు చికిత్సపరంగా సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు.


  • వైద్యుల ప్రమేయం

బయాప్సీ ప్రక్రియలో వైద్యులు ఎంతో ఆచితూచి వ్యవహరిస్తారు. కణితి నుంచి కణాలు బయటకు వచ్చేయకుండా, కణితి పగిలిపోకుండా, చితికిపోకుండా ఆ ప్రక్రియ మొత్తాన్నీ ఎంతో జాగ్రత్తగా ప్లాన్‌ చేస్తారు. పొత్తికడుపు కేన్సర్‌ మాదిరిగా కణితి పగిలిపోయే ముప్పు ఉందని గ్రహిస్తే, ఇబ్బందులు తలెత్తకుండా ఉండడం కోసం రెట్టింపు ముందస్తు జాగ్రత్తలు పాటిస్తారు. బయాప్సీలు కేన్సర్‌ చికిత్సలో కీలకమైన సమాచారాన్ని అందించి, సమర్థమైన చికిత్సను అంచనా వేయగలిగే అవకాశాన్ని కల్పిస్తాయి. ఫలితంగా చికిత్సా ఫలితం కూడా మెరుగ్గా ఉంటుంది. కాబట్టి బయాప్సీ గురించిన అనుమానాలు, భయాలను వైద్యులను అడిగి నివృత్తి చేసుకుని నిర్భయంగా కేన్సర్‌ చికిత్సను కొనసాగించడం అన్ని విధాలా శ్రేయస్కరం.

డాక్టర్‌ ఎస్‌. నిఖిల్‌ ఘడ్యాల్‌ పాటిల్‌

సీనియర్‌ మెడికల్‌ ఆంకాల జిస్ట్‌ అండ్‌ హెమటో ఆంకాలజిస్ట్‌,

యశోద హాస్పిటల్స్‌, సోమాజిగూడ, హైదరాబాద్‌.

Updated Date - Sep 10 , 2024 | 05:00 AM

Advertising
Advertising