Navya : పదార్థాలు- ప్రత్యామ్నాయాలు
ABN, Publish Date - Jul 16 , 2024 | 12:38 AM
తోచింది, నచ్చింది తినడం కాదు. ఆరోగ్యానికి మేలు చేసేదీ, పోషకభరితమైనదీ తినాలి. అందుకోసం వీలున్న ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలి.
గుడ్ ఫుడ్
తోచింది, నచ్చింది తినడం కాదు. ఆరోగ్యానికి మేలు చేసేదీ, పోషకభరితమైనదీ తినాలి. అందుకోసం వీలున్న ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలి.
జంక్ ఫుడ్: పిజాలు, బర్గర్లు మొదలైన జంక్ ఫుడ్స్‌లో అత్యధిక క్యాలరీలుంటాయి. వీటిలోని రిఫైన్డ్ దినుసులు ఆరోగ్యానికి హానికరం కాబట్టి వీటికి బదులుగా తక్కువ క్యాలరీలున్న సలాడ్లు, మొలకలు ఎంచుకోవాలి.
పునుగులు, బజ్జీలు: ఈ స్నాక్స్ తరచూ తింటూ ఉంటాం. ఇంట్లో తయారుచేసుకున్నవే తిన్నా వీటి ద్వారా అధిక మొత్తాల్లో కొవ్వులు శరీరంలోకి చేరతాయి. కాబట్టి వీటికి బదులుగా నట్స్, సీడ్స్ తినాలి. వేరుసెనగలు, బాదం లాంటి వాటిలో ఆరోగ్యకరమైన కొవ్వులుంటాయి.
బిస్కెట్లు, కేకులు: ఈ స్నాక్స్‌లో అత్యధికంగా పాలిష్ పట్టిన దినుసులుంటాయి. అలాగే అత్యధిక కొవ్వులు, చక్కెరలు ఉంటాయి. వీటికి బదులుగా సంప్రదాయ తీపి పదార్థాలైన వేరుసెనగ చిక్కీలు, పల్లీ ముద్దలు, మిల్లెట్ ఉండలు లాంటివి తినాలి.
కూల్ డ్రింక్స్: వీటిలో చక్కెర ఎక్కువ. ఎనర్జీ డ్రింక్‌లు, జీరో షుగర్ డ్రింకులు కూడా హానికరమే! కాబట్టి వీటికి ప్రత్యామ్నాయంగా కొబ్బరినీళ్లు, మజ్జిగ, తాజా చెరకు రసాలు తాగాలి.
పళ్ల రసాలు: వీటిని ఇంట్లో తయారుచేసుకునే అలవాటు ఉండదు కాబట్టి బయట దొరికే పండ్లరసాల మీదే ఆధారపడుతూ ఉంటాం. వీటిలో చక్కెరలు ఎక్కువ. పైగా పండ్ల రసాలతో తగిన పీచు శరీరానికి అందకుండా పోతుంది. కాబట్టి పండ్ల రసాలకు బదులుగా నేరుగా పండ్లనే తినడం అలవాటు చేసుకోవాలి.
జామ్స్, సాస్, డిప్స్: వీటిలో ఉప్పు, చక్కెరలు, నిల్వ పదార్థాలు, కృత్రిమ రంగులు ఎక్కువ. వీటికి బదులుగా ఇంట్లో తయారుచేసిన పచ్చళ్లు ఎంచుకోవాలి.
Updated Date - Jul 16 , 2024 | 12:38 AM