Five Apps for iPhone : ఐఫోన్‌కు అనువైన అయిదు యాప్స్
ABN , Publish Date - Jan 26 , 2024 | 10:42 PM
స్మార్ట్ ఫోన్... స్మార్ట్ వర్క్ ఇప్పటి ట్రెండ్. పెరుగుతున్న సాంకేతికత పనిభారాన్ని తగ్గిస్తే మంచిదే కదా...! అలా అనుకున్నప్పుడు ప్రత్యేకించి ఈ యాప్‌లు ఐఫోన్‌లో ఉంటే పని ఏదైనా సులువుగా పూర్తవుతుందని నిపుణులు చెబుతున్నారు. నోట్స్ తీసుకోవడం నుంచి కంటెంట్

స్మార్ట్ ఫోన్... స్మార్ట్ వర్క్ ఇప్పటి ట్రెండ్. పెరుగుతున్న సాంకేతికత పనిభారాన్ని తగ్గిస్తే మంచిదే కదా...! అలా అనుకున్నప్పుడు ప్రత్యేకించి ఈ యాప్‌లు ఐఫోన్‌లో ఉంటే పని ఏదైనా సులువుగా పూర్తవుతుందని నిపుణులు చెబుతున్నారు. నోట్స్ తీసుకోవడం నుంచి కంటెంట్ క్రియేషన్, డ్రాఫ్టింగ్ ఈ మెయిల్స్, ఫొటోల ఎడిటింగ్ వరకు అన్నింటికీ అనువైన ఈ యాప్‌లు ఏమిటో చూద్దాం.
పెప్లెక్సిటీ: వెబ్ ఇండెక్స్‌లను ఇది ఏఐ మోడల్స్‌తో ఇంటిగ్రేట్ చేస్తుంది. సంప్రదాయ సెర్చ్ ఇంజన్ల మాదిరిగా కాకుండా చాట్‌బోట్‌కు అవకాశం ఉంది. దాంతో నేచురల్ లాంగ్వేజ్‌లో ప్రశ్నలు అడిగి, సమాధానాలను రాబట్టుకోవచ్చు. దీనికోసం ఓపెన్ ఏఐకి చెంది జీపీటీ-3.5 సహకారం ఉంది. కచ్చితత్వం, పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తుంది. ఫలితంగా ప్రశ్నకు తగ్గ సమాధానాలను రాబట్టుకునే అస్కారం ఉంటుంది. గూగుల్, మైక్రోసాఫ్ట్‌కు భిన్నంగా ఉంటుంది. లింకులను డిస్‌ప్లే చేయదు. పోటీ ప్రపంచంలో యూనిక్ సమాధానం ఇచ్చే యత్నం చేస్తుంది.
చాట్‌సోనిక్: ఇదో సంభాషణలకు అవకాశం ఇచ్చే ఏఐ చాట్‌బోట్. చాట్ జీపీటీకి ఉన్న పరిమితులను ఇది అవకాశంగా మలుచుకుంది. లేటెస్ట్ డేటా ఆప్షన్. నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, మెషీన్ లెర్నింగ్, జీపీటీ-4, స్టేబుల్ డిఫ్యూజన్ వంటివన్నీ ఉపయోగించుకుంటుంది. టైప్ ఆఫ్ పర్సనాలిటీ, ఎనేబుల్ మెమెరీ వంటివి కూడా ఎంపిక చేసుకోవచ్చు. మొత్తమ్మీద రియల్ పర్సన్ సమాధానం ఇస్తున్న ఫీలింగ్‌ను కలిగిస్తుంది.
ఒట్టర్: ఏఐ పవర్డ్ వాయిస్ టు టెక్స్ట్ ట్రాన్స్‌క్రిప్షన్ టూల్ ఇది. మాట్లాడే పదాలను టెక్స్ట్‌కు అనువర్తించడం ద్వారా చదువకోవచ్చు, సులువుగా అర్థం చేసుకోవచ్చు. ఏఐ అల్గోరిథమ్ సహాయంతో ఇది టెక్స్ట్‌ని జనరేట్ చేస్తుంది. ఈ యాప్‌ని పలువిధాలుగా అంటే మొబైల్ యాప్ వెర్షన్‌గా కూడా ఉపయోగించుకోవచ్చు. సమావేశాలను రికార్డ్ చేసుకోవచ్చు. ఆడియో, వీడియో రూపంలో అప్‌లోడ్ చేస్తే మాటలు ట్రాన్స్‌క్రైబ్ అవుతాయి. ఒట్టర్ బాట్ ఉపయోగించి ఆడియో రికార్డింగ్, నోట్స్ రాసుకోవడం, యాక్షన్ ఐటెమ్స్ పట్టుకోవడం, సమ్మరీలను జనరేట్ చేయడం వరకు అన్నింటికి ఉపయోగకరంగా ఉంటుంది.
రెమిని: ఏఐ ఫీచర్లను గత ఏడాది జతచేసిన తరవాత ఈ యాప్ ట్రాక్‌లోకి వచ్చింది. ఇదో ఫొటో ఎడిటింగ్ యాప్. దీన్లోని జనరేటివ్ ఏఐ ఫీచర్‌తో ఫొటోలకు ప్రొఫెషనల్ లుకింగ్ తీసుకురావచ్చు. ముఖ్యంగా సీవీ, పోర్ట్ ఫోలియోలు, లింక్డిన్ కోసం ఇది బాగా ఉపయోగపడుతుంది. సెల్ఫీని అప్‌లోడ్ చేస్తే సరిపోతుంది. మిగిలిన పనంతా యాప్ చూసుకుంటుంది. పాతవి, బ్లర్‌గా ఉన్నవి, స్ర్కాచ్ ఫొటోలను కూడా మార్చగలదు. ఫొటోలను హెచ్‌డీలోకి మారుస్తుంది. మొత్తమ్మీద షేర్ చేసుకునేందుకు వీలుగా రూపొందిస్తుంది.
చాట్‌జీపీటీ: దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ ఉండదు. ఇప్పటికే జనాదరణ పొందింది. ఇందులో ఏ ప్రశ్న అడిగినా జవాబు వస్తుంది. ఐఫోన్లలో ఏఐ ఆధారిత చాట్‌బోట్ ఉంటుంది. చాట్‌జీపీటీ సృష్టికర్త ఓపెన్ ఏఐకి చెందిన స్పీచ్ రికగ్నిషన్ సిస్టమ్‌తో వాయిస్ ఇన్‌పుట్‌కు సపోర్ట్ అందిస్తుంది. జీపీటీ-4తో అడ్వాన్స్‌డ్ ఫీచర్ల యాక్సెస్ కూడా ఉంటుంది.