Anklets: పట్టీలు పెట్టుకోవడానికి నమోషీగా ఫీల్ అవుతున్నారా.. ఇవి తెలుసుకుంటే వెంటనే పెట్టుకుంటారు..
ABN, Publish Date - Nov 09 , 2024 | 02:25 PM
ఈ మధ్య కాలంలో మహిళలు వెండి పట్టీలు పెట్టుకోవడానికి నమోషీగా ఫీల్ అవుతుంటారు. అయితే, పట్టీలు పెట్టుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే వెంటనే వాటిని ధరిస్తారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం..
Anklets: మహిళలు పట్టీలు పెట్టుకోవడం వల్ల వారి పాదాలు అందంగా కనిపిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంట్లో ఆడ పిల్ల ఉందంటే కచ్చితంగా కాళ్లకు పట్టీలు పెట్టుకుని ఘల్లు ఘల్లు మని మోగాల్సిందే. ఈ సంప్రదాయం పురాతన కాలం నుంచి కొనసాగుతుంది. అయితే, ఈ మధ్య కాలంలో క్రమంగా ఈ సంప్రదాయం కనిపించడం లేదు. ముఖ్యంగా సిటీలో ఉన్న మహిళలు, ఆడపిల్లలు పట్టీలు పెట్టుకోవడం నమోషీగా ఫీల్ అవుతారు. అయితే, పట్టీలు కేవలం పాదాల అందం కోసం మాత్రమే కాదు.. అనారోగ్య సమస్యలు చెక్ పెట్టడానికి కూడా సహాయపడుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మహిళలు వెండి పట్టిలు ధరిస్తే ఆరోగ్యానికి ఎంత మేలు? వాటిని ధరించడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల ఏంటి? అనే విషయాలను తెలుసుకుందాం.
ప్రయోజనాలు:
వెండి శరీరాన్ని చల్లబరుస్తుంది. బాడీ హీట్‌తో బాధపడేవారికి వెండి పట్టీలు ధరిస్తే కాస్త ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా శరీర ఉష్ణాగ్రత అదుపులో ఉంచుకోవచ్చు. అంతేకాకుండా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వెండి పట్టీలు ధరించడం వల్ల శరీరంలో కాళ్ల నుండి శక్తిని నిల్వ చేస్తుంది. పట్టీలు పెట్టుకోవడం ద్వారా ఎముకలు దృఢంగా తయారవుతాయి. ఆర్థరైటీస్ సమస్యతో బాధపడేవారు వెండీ పట్టీలు పెట్టుకోవడం ద్వారా కాస్త ఉపశమనం పొందువచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఆడువారు వెండి పట్టీలు, ఉంగరాలు, మెట్టెలు ధరించడం వల్ల ఆర్థరైటీస్ సమస్య తగ్గుతుందని చెబుతున్నారు. అంతేకాకుండా వెండి ధరించడం వల్ల మానసికంగా ఉంతోషంగా ఉంటారని నిపుణులు అంటున్నారు.
హార్మోన్ల సమతుల్యత..
వెండి పట్టీలు ధరించడం వల్ల మహిళల్లో హార్మోన్ స్థాయిలు సమతుల్యం అవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొంతమంది ఆడవారు పీరియడ్స్ వచ్చిందంటే అనేక ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతుంటారు. పొత్తి కడుపులో నొప్పి, నడుం నొప్పి, చిరాకు, నీరసం వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. అయితే, ఈ సమస్యలు తగ్గడానికి వెండి పట్టిలు ఎంతో సహాయపడుతాయని నిపుణులు చెబుతున్నారు. పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పిని నయం చేస్తుందని.. గర్భాశయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుందని అంటున్నారు. వెండి పట్టిలు ధరించడం వల్ల శరీరంపై అయ్యే గాయాలు కూడా త్వరగా నయం అవుతాయి. ఇన్ ఫెక్షన్ లతో పోరాడే శక్తి కూడా లభిస్తుందని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా బ్లడ్ సర్క్యూలేషన్ పెంచుతుందని నిపుణులు అంటున్నారు.
Also Read:
యూట్యూబ్ చూసి ఆ పని చేశారు.. చివరికి ఏం జరిగిందంటే..
నామినేటెడ్ పదవుల రెండో జాబితా రిలీజ్
For More Health and National News
Updated Date - Nov 09 , 2024 | 03:09 PM