ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Health is wealth : బ్లడ్‌ థిన్నర్స్‌ ఎందుకు?

ABN, Publish Date - Nov 05 , 2024 | 12:47 AM

కాగులెంట్స్‌ వల్లే రక్తం ద్రవరూపంలో ఉంటుంది. రక్తంలో ఉండే కాగ్యులెంట్స్‌, ప్లేట్‌లెట్లు రక్తస్రావాన్ని నియంత్రిస్తూ ఉంటాయి. అయితే ఏ కారణంగానైనా ఇవి హెచ్చుతగ్గులకు గురైనప్పుడు రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడతాయి. ఈ పరిస్థితి తలెత్తకుండా బ్లడ్‌ థిన్నర్స్‌ ఉపయోగపడతాయి.

హెల్త్‌ వెల్త్‌

కాగులెంట్స్‌ వల్లే రక్తం ద్రవరూపంలో ఉంటుంది. రక్తంలో ఉండే కాగ్యులెంట్స్‌, ప్లేట్‌లెట్లు రక్తస్రావాన్ని నియంత్రిస్తూ ఉంటాయి. అయితే ఏ కారణంగానైనా ఇవి హెచ్చుతగ్గులకు గురైనప్పుడు రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడతాయి. ఈ పరిస్థితి తలెత్తకుండా బ్లడ్‌ థిన్నర్స్‌ ఉపయోగపడతాయి.

ధుమేహం, అధిక రక్తపోటు, ధూమపానం, అధిక కొలెస్ట్రాల్‌, అతి ఒత్తిడి వంటి కారణాల వల్ల రక్తనాళాల్లోని లోపలి పొరలో ఉండే ఎండోథీలియం కణాలు దెబ్బతింటాయి. ఇవే కాకుండా, శరీరక శ్రమ లోపించడం, స్థూలకాయం వల్ల కూడా ఈ స్థితి ఏర్పడుతుంది. ఎండోథీలియం కణాలు దెబ్బ తిన్నప్పుడు రక్తం చిక్కబడటం, గడ్డలు కట్టడం జరుగుతుంది. ఈ గడ్డలు గుండె రక్తనాళాల్లో అడ్డుపడి గుండెపోటుకు కారణం కావచ్చు. మెదడు రక్తనాళాల్లో అడ్డుపడి పక్షవాతానికి కారణం కావచ్చు. అయితే, గడ్డలు ఏర్పడకుండా యాంటీ కాగులెంట్లను, ప్లేట్‌లెట్ల అసహజఽ ధోరణిని నివారించడానికి యాంటీ ప్లేట్‌లెట్లను ఇవ్వాల్సి ఉంటుంది.

  • బ్లడ్‌ థిన్నర్లు అందుకే...

సాధారణంగా రక్తాన్ని పలచబరిచే బ్లడ్‌ థిన్నర్లను రెండవ దశ వైద్యంగానే ఇస్తారు. అంటే యాంజియోప్లాిస్ట్టీ, లేదా స్టెంట్‌లు వేసిన తర్వాత ఇస్తూ ఉంటారు. ఈ మందులను కనీసం ఏడాదిపాటైనా, క్రమం తప్పకుండా వాడుకోవలసి ఉంటుంది. దెబ్బతిన్న గుండె కవాటాలకు చికి త్స పొందిన వాళ్లయితే ఈ మందులను జీవితకాలమంతా వాడాల్సి ఉంటుంది. కాలి నరాల్లో రక్తం గడ్డలు కట్టినప్పుడు(థ్రాంబోసిస్‌), అవి కరిగిపోవడానికి ఈ మందులు 6 మాసాల పాటు వాడాల్సి ఉంటుంది. రక్తం గడ్డకట్టుకుపోవడం వల్ల కొందరి గుండె లయ తప్పుతూ ఉంటుంది. అలాంటి వారికి కూడా యాంటీ కాగ్యులెంట్లు, నావల్‌-యాంటీ కాగ్యులెంట్ల వంటి మందుల వల్ల ప్రయోజనం కలుగుతుంది.


  • జాగ్రత్తలు తప్పవు!

బ్లడ్‌ థిన్నర్ల వల్ల ఎంతో మంది హృద్రోగులకు ప్రయోజనం కలుగుతుందనేది వాస్తవం. అయితే, కొంత మంది హృద్రోగులు వీటి దుష్ప్రభావాలకు గురయ్యే ప్రమాదం కూడా ఉంది. ముఖ్యంగా రక్తం పలచగా ఉండడం వల్ల ఎముకలు, పొట్ట, చర్మం, మెదడు భాగాల్లో అతిగా రక్తస్రావం జరిగే ప్రమాదం ఉంది. అయితే, రోగి పడిపోయి గాయాల పాలై, లేదా మరేదైనా ప్రమాదానికి గురైనప్పుడే ఈ దుష్ప్రభావాలు ఎక్కువగా కనిపిస్తాయి. అందువల్ల ఇలాంటి ప్రమాదాల బారిన పడకుండా పలు విధాల ముందు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. అలాగే ఏదైనా సర్జరీ జరగడానికి, లేదా దంతాలను తొలగించడానికి ముందు బ్లడ్‌ థిన్నర్‌ మందులను ఆపాల్సి ఉంటుంది. సర్జరీ అయిపోయాక మందులను వేసుకోవడం మళ్లీ కొనసాగించవచ్చు. ఈ కొన్ని జాగ్రత్తలు పాటిస్తే, బ్లడ్‌ థిన్నర్ల ద్వారా అనేక ప్రయోజనాలు, అవసరమైన ఆరోగ్య రక్షణ పొందవచ్చు.

Updated Date - Nov 05 , 2024 | 12:54 AM