ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Health : యాప్స్‌తో వ్యాయామం

ABN, Publish Date - Oct 02 , 2024 | 05:49 AM

వ్యాయామంతోనే ఆరోగ్యం. కానీ సమయం దొరకడం లేదనే సాకుతో చాలామంది వ్యాయామం జోలికి వెళ్లరు. అలాంటి వారు ఇంట్లోనే ఫోన్‌లో కొన్ని యాప్స్‌ ఇన్‌స్టాల్‌ చేసుకుని అవసరమైన వ్యాయామాలు చేసుకోవచ్చు.

Yoga : వ్యాయామంతోనే ఆరోగ్యం. కానీ సమయం దొరకడం లేదనే సాకుతో చాలామంది వ్యాయామం జోలికి వెళ్లరు. అలాంటి వారు ఇంట్లోనే ఫోన్‌లో కొన్ని యాప్స్‌ ఇన్‌స్టాల్‌ చేసుకుని అవసరమైన వ్యాయామాలు చేసుకోవచ్చు.

  • యోగా చేయాలంటే....

పార్కుకు వెళ్లి వాకింగ్‌ చేసే సమయం లేని వారు, జిమ్‌కు వెళ్లి వర్కవుట్స్‌ చేసే వీలు లేని వారు ఇంట్లోనే యోగా ద్వారా శరీరానికి కావలసిన వ్యాయామం చేసుకోవచ్చు. ఇందుకోసం ‘డైలీ యోగా’ అప్లికేషన్‌ చక్కగా ఉపయోగపడుతుంది. ఇందులో చూసి యోగాసనాలు వేయవచ్చు. ఇందులో ఉన్న వాయిస్‌ ఇన్‌స్ట్రక్షన్స్‌, బ్యాక్‌గ్రౌండ్‌మ్యూజిక్‌ ఫీచర్స్‌ ఉత్సాహాన్ని అందిస్తాయి. పదేళ్లకు పైగా టీచింగ్‌ అనుభవం ఉన్న ప్రొఫెషనల్స్‌ అందించిన కంటెంట్‌ ఈ యాప్‌లో ఉంది. ఎంత సేపు యోగా చేయాలనేది ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. ఇందులో బోలెడు యోగాసనాలు అందుబాటులో ఉన్నాయి. బెగినర్స్‌ అయితే ‘యోగా ఫర్‌ బెగినర్‌’ యాప్‌ను ఎంచుకోవచ్చు. ఇందులో రోజు చేయాల్సిన యోగాసనాలు, 500లకు పైగా వర్కవుట్స్‌ ఉన్నాయి. యోగా మొదలుపెట్టాలని అనుకుంటున్న వారు ఎంచుకోదగిన యాప్‌ ఇది. నెల రోజుల ప్లాన్‌ను ఎంచుకుని మొదలుపెట్టొచ్చు.

  • సిక్స్‌ ప్యాక్‌ కోసం...

సిక్స్‌ ప్యాక్‌ అంటే అందరికీ ఇష్టమే. కానీ కొంతమంది మాత్రమే దాన్ని సాధించుకోగలుగుతారు. మీరూ ఆ కోవకు చెందిన వారు కావాలంటే ‘సిక్స్‌ ప్యాక్‌ ఇన్‌ 30 డేస్‌’ యాప్‌ని ఫాలో అవ్వండి. ఇందులో ఉన్న వర్కవుట్స్‌ అన్ని వయస్సుల వారికి సూటబుల్‌గా ఉంటాయి. ఎప్పుడైనా, ఎక్కడైనా సులువుగా చేయవచ్చు. రోజూ కొంత సమయం కేటాయిస్తే చాలు. సిక్స్‌ ప్యాక్‌ మీ సొంతమవుతుంది.

  • బరువు తగ్గాలంటే...

బరువు తగ్గాలంటే గంటల తరబడి వర్కవుట్స్‌ చేయాల్సిన అవసరం లేదు. వాకింగ్‌ ద్వారా కూడా బరువు తగ్గొచ్చు. ఇందుకోసం ‘వాకింగ్‌ వర్‌ వెయిట్‌లాస్‌’ యాప్‌ ఉపయోగ పడుతుంది. బరువు తగ్గేలా చేసే ఫిట్‌నెస్‌ ప్లాన్‌ను ఇందులో డిజైన్‌ చేశారు. స్పీడప్‌ మెథడ్‌తో ఉన్న వాకింగ్‌ ఎక్సర్‌సైజులు బరువు తగ్గేందుకు ఎఫెక్టివ్‌గా ఉపకరిస్తాయి. రకరకాల వ్యాయామ లక్ష్యాలకు, వర్కవుట్‌ లెవెల్స్‌కు నప్పుతుంది. మూడు లెవెల్స్‌లో క్లిష్టమైన వాకింగ్‌ ఎక్సర్‌సైజులు ఈ యాప్‌లో ఉన్నాయి. మీరు వాకింగ్‌ ఇప్పుడే ప్రారంభిస్తున్నా, చాలా కాలంగా చేస్తున్నా మీకు సరిపోయే వర్కవుట్స్‌ ఎంచుకోవచ్చు.

Updated Date - Oct 02 , 2024 | 05:49 AM