ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Health : గ్యాస్‌ వేధిస్తుంటే..

ABN, Publish Date - Sep 03 , 2024 | 01:00 AM

వేళకు తినకపోవడం, తిన్నా అరగకపోవడం చాలా మందికి ఎదురయ్యే సమస్య. వేపుళ్లు, జంక్‌ ఫుడ్‌, అధిక నూనెతో వండిన వంటకాలను తినటం వల్ల గ్యాస్‌ పెరిగి కడుపుబ్బరం సమస్య ఎర్పడుతుంది. దీనికి చిన్న చిట్కాలతో పరిష్కారం లభిస్తుంది. అవేమిటో చూద్దాం..

వేళకు తినకపోవడం, తిన్నా అరగకపోవడం చాలా మందికి ఎదురయ్యే సమస్య. వేపుళ్లు, జంక్‌ ఫుడ్‌, అధిక నూనెతో వండిన వంటకాలను తినటం వల్ల గ్యాస్‌ పెరిగి కడుపుబ్బరం సమస్య ఎర్పడుతుంది. దీనికి చిన్న చిట్కాలతో పరిష్కారం లభిస్తుంది. అవేమిటో చూద్దాం..

సమస్య మూలమిది: మనం తిన్న ఆహారం కడుపులోకి వెళ్లిన తరువాత.. జీర్ణం అవుతుంది. ఆ జీర్ణప్రక్రియలో కొన్ని రకాల వాయువులు విడుదలవుతాయి. కొన్ని సార్లు. అవి బయటికి వెళ్లకుండా కడుపులోను, పేవులలోను పేరుకుపోతాయి. అవి చెడువాయువులుగా మారి ఇబ్బంది పెడతాయి. ఆయుర్వేదంలో ఈ సమస్యను ఆర్భానం, ఆటోపం అంటారు. ఈ వాయువులు బయటకు వెళ్లకపోతే

ఆ ప్రభావం గుండె.. ఊపిరితిత్తులపై పడుతుంది. గుండె దడ, ఆందోళన, గుండెల్లో నెప్పి మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. ప్రతి రోజు క్రమం తప్పకుండా పల్చటి మజ్జిగ తాగితే ఈ సమస్య చాలా వరకూ పరిష్కారమవుతుంది.


చిట్కాలివే: అరిటి బోద లోపల తెల్లటి పదార్ధం ఉంటుంది. దీని రసాన్ని రోజుకు ఒక కప్పు చొప్పున 15 రోజులు తాగితే గ్యాస్‌ సమస్య తగ్గిపోతుంది.

  • అల్లం రసం తీసి దానిని వేడిచేసి తగినంత బెల్లం కలపాలి. ఇలా కలిపిన మిశ్రమాన్ని రోజుకు ఒక స్పూను తాగాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే కడుపుబ్బరం తగ్గిపోతుంది.

  • గింజలున్న ఎండిన నల్ల ద్రాక్షను తీసుకొని నీళ్లలో ఆరు గంటలు నానబెట్టాలి. ఇలా నానిన ద్రాక్ష రసాన్ని తాగితే గ్యాస్‌ సమస్య తగ్గుతుంది.

  • శొంఠిపొడి, పాత బెల్లంపొడిలను సమ పాళ్లలో కలుపుకోవాలి. ప్రతి రోజూ ఉదయం ఈ మిశ్రమాన్ని ఒక స్పూను తినాలి. ఆ తర్వాత వేడి నీళ్లు తాగాలి. ఇలా తాగితే కడుపులో ఉన్న మలినాలన్నీ తొలగిపోతాయి.

  • ధనియాలు, శొంఠిలను సమపాళ్లలో తీసుకొని.. వేడి నీటిలో మరిగించాలి. అలా తయారయిన కషాయాన్ని తాగి నడిస్తే- గ్యాస్‌ సమస్య తగ్గుతుంది.

  • సోంపు, జీలకర్ర, వాములను సమపాళ్లలో తీసుకొని పొడి చేయాలి. ఈ పొడిని ఉదయం, సాయంత్రం ఒక స్పూను చొప్పున వేడి నీళ్లలో వేసుకొని తాగాలి. ఇలా తాగితే వారం రోజుల్లో గ్యాస్‌ సమస్య తొలగిపోతుంది.

Updated Date - Sep 03 , 2024 | 01:00 AM

Advertising
Advertising