Gourd Juice : గుమ్మడికాయ రసాన్ని అదేపనిగా తాగేస్తున్నారా .. దీనితో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి సుమా..!
ABN, Publish Date - May 16 , 2024 | 04:30 PM
బూడిదగుమ్మడిలో విటమిన్ సి, బి కాంప్లెక్స్, విటమిన్లు, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్ అధికంగా ఉన్నాయి. అయితే ఇందులో 96శాతం నీరు కూడా ఉంటుంది. ఎలివేటెడ్ ఎనర్జీ లెవల్స్ మెరుగైన ఊపిరితిత్తులు పనితీరు, మెరుగైన జీర్ణక్రియను అందిస్తుంది.
బరువు తగ్గుతారని చాలా మంది ఈ బూడిదగుమ్మడి రసాన్ని పరగడుపుతో తాగుతున్నారు. కొందరు డైట్లో భాగం చేసుకున్నారు. అయితే ఇది బరువు తగ్గిస్తుందా.. ఏమో అన్ని ప్రయోజనాలున్న గుమ్మడి ఇప్పుడు ఎందుకు తాగకూడదు అంటున్నారు. అదే తెలుసుకుందాం.
ఇటీవలి సంవత్సరాల్లో బూడిద గుమ్మడిలో మంచి పోషకాలున్నాయని తెగ తాగుతున్నారు ఈ జ్యూస్. అయితే కొందరు మాత్రమే దీని వల్ల కలిగే ఇబ్బంది ఏమిటో తెలుసుకున్నారు. ఈ బూడిద గుమ్మడి అనేక సమస్యలకు పరిష్కారంగా పేరుగాంచింది కానీ దీనిని తీసుకోవడం వల్ల బరువు ఇట్టే తగ్గవచ్చనే ప్రచారం కూడా చాలా జోరుగా జరిగింది. ఇది ఇంద్రియాలను రీఫ్రెష్ చేస్తుందనేంత వరకూ సరిగానే ఉంది కానీ కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. అవేమిటో చూద్దాం.
జుట్టు, గోళ్లు పెరుగుదలకు బయోటిన్ ఎంత వరకూ అవసరం..!
బూడిదగుమ్మడిలో విటమిన్ సి, బి కాంప్లెక్స్, విటమిన్లు, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్ అధికంగా ఉన్నాయి. అయితే ఇందులో 96శాతం నీరు కూడా ఉంటుంది. ఎలివేటెడ్ ఎనర్జీ లెవల్స్ మెరుగైన ఊపిరితిత్తులు పనితీరు, మెరుగైన జీర్ణక్రియను అందిస్తుంది. నిద్రలేమి సమస్యను కూడా తగ్గిస్తుంది. చర్మ సమస్యలకు కూడా చక్కనిపరిష్కారం అందిస్తుంది.
ఈ జ్యూస్ ఎక్కువగా తీసుకుంటే మాత్రం..
విరేచనాలు, పొత్తి కడుపులో అసౌకర్యం ఉంటాయి.
బరువు తగ్గడం అటుంచి శరీరంలో కఫాన్ని పెంచుతుంది. ఇది బ్రోన్రైటిస్, జలుబు, ఆస్తమా ఉన్న వ్యక్తులు తక్కువగా తీసుకోవాలి.
బ్రోన్రైటిస్, జలుబు, ఉబ్బరం ఉన్న వారిలో శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తుతాయి.
జ్వరం, జలుబు ఉన్నవారు దీనిని తీసుకోకపోవడం మంచిది.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.
Updated Date - May 16 , 2024 | 04:30 PM