ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Health Tips : ‘డ్యాష్‌’ డైట్‌

ABN, Publish Date - Jul 09 , 2024 | 01:26 AM

డైటరీ అప్రోచెస్‌ టు స్టాప్‌ హైపర్‌టెన్షన్‌ అనే డ్యాష్‌ డైట్‌ను అమెరికాకు చెందిన డాక్టర్‌. మార్లా హెల్లర్‌ కనిపెట్టింది.

హై బిపి

డైటరీ అప్రోచెస్‌ టు స్టాప్‌ హైపర్‌టెన్షన్‌ అనే డ్యాష్‌ డైట్‌ను అమెరికాకు చెందిన డాక్టర్‌. మార్లా హెల్లర్‌ కనిపెట్టింది. రకరకాల ఆహారపదార్థాల ద్వారా శరీరానికి తగినన్ని పోషకాలను అందించి ఆరోగ్యాన్ని మెరుగు పరచటంతోపాటు రక్తపోటును తగ్గించటంలో ఈ డ్యాష్‌ డైట్‌ దిట్ట. రక్తపోటు రాకుండా ఉండాలన్నా,నియంత్రణలో ఉండాలన్నా ఈ డైట్‌ను అనుసరించటం మేలని వైద్యులు కూడా అంటున్నారు.

ఈ డైట్‌ను అనుసరిస్తే రెండు వారాల్లోనే సిస్టాలిక్‌ బ్లడ్‌ ప్రెషర్‌ 8 నుంచి 14 పాయింట్లు తగ్గినట్టు ప్రయోగాత్మకంగా రుజువైంది. సోడియంను తగ్గించటంతోపాటు రక్తపోటును నియంత్రణలో ఉంచే పొటాషియం, కాల్షియం, మెగ్నీషియంలను పెంచటం డ్యాష్‌ డైట్‌ ప్రత్యేకత. ఈ డైట్‌లో భాగంగా తృణధాన్యాలు, పళ్లు, కూరగాయలు, తక్కువ కొవ్వు ఉండే పాల ఉత్పత్తులు తీసుకోవాలి. చేపలు, చికెన్‌, చిక్కుళ్లతోపాటు వారంలో ఒకటి రెండు రోజులు నట్స్‌, సీడ్స్‌ తినాలి. తక్కువ పరిమాణాల్లో మాంసం, స్వీట్లు, కొవ్వులు కూడా తీసుకోవచ్చు.

  • తృణధాన్యాల్లో భాగంగా రోజుకి ఒక హోల్‌ వీట్‌ బ్రెడ్‌ స్లయిస్‌ లేదా అర కప్పు బ్రౌన్‌ రైస్‌ లేదా పాస్తా తినొచ్చు.

  • టొమాటో, క్యారెట్‌, బ్రక్కొలి, స్వీట్‌ పొటాటో, ఆకుకూరల్లో పీచు ఎక్కువగా ఉంటుంది. విటమిన్లతోపాటు పొటాషియం, మెగ్నీషియం కూడా సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి వీటిని రోజూ తినటం మేలు.ఫ పుల్లగా ఉండే నారింజ, బత్తాయి లాంటి సిట్రస్‌ ఫ్రూట్స్‌ తినాలి.

  • పాలు, పెరుగు, జున్ను కాల్షియం, విటమిన్‌ డి ఎక్కువగా ఉండే పదార్థాలు. వీటిని తినటం వల్ల కూడా రక్తపోటు అదుపులో ఉంటుంది.

Updated Date - Jul 09 , 2024 | 01:26 AM

Advertising
Advertising
<