ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Diabetes Patients: మధుమేహ బాధితులు పాలు తాగొచ్చా? కీలక వివరాలు మీకోసం..

ABN, First Publish Date - 2024-02-09T18:04:00+05:30

Milk Benefits: ప్రస్తుత ఉరుకులు, పరుగుల జీవితంలో ప్రజలు అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటుంటారు. ఇందుకు కారణం సరికాని జీవనశైలి.. జంక్ ఫుడ్స్ అతిగా తినడం వంటి వాటి కారణంగా అనేక వ్యాధుల బారిన పడుతుంటారు. ముఖ్యంగా ప్రస్తుత కాలంలో చాలా మంది ప్రజలు మధుమేహం బారిన పడుతున్నారు.

Milk Side Effects

Milk Benefits: ప్రస్తుత ఉరుకులు, పరుగుల జీవితంలో ప్రజలు అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటుంటారు. ఇందుకు కారణం సరికాని జీవనశైలి.. జంక్ ఫుడ్స్ అతిగా తినడం వంటి వాటి కారణంగా అనేక వ్యాధుల బారిన పడుతుంటారు. ముఖ్యంగా ప్రస్తుత కాలంలో చాలా మంది ప్రజలు మధుమేహం బారిన పడుతున్నారు. ఒకసారి మధుమేహం బారిన పడినట్లయితే.. జీవితాంతం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆహారం విషయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. అధిక ఫైబర్, తక్కువ కొవ్వు పదార్థాలు ఉన్న ఆహారం తీసుకోవాలి. అయితే, కొందరు మధుమేహ బాధితులు.. ఆరోగ్యం కోసం పాలు, పాల ఉత్పత్తులను తీసుకుంటారు. మరికొందరు అసలు పాలు తాగొచ్చా? లేదా? అని సందిగ్ధంలో ఉంటారు. మరి ఇంతకీ మధుమేహ వ్యాధిగ్రస్తులు పాలు తాగొచ్చా? లేదా? కీలక వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం..

మధుమేహ వ్యాధిగ్రస్తులు పాలు తాగవచ్చా? లేదా?

పాలలో కొవ్వు..

పాలలో చాలా కొవ్వు ఉంటుంది. పరిశోధనల ప్రకారం.. పాలు మధుమేహాన్ని కలిగిస్తాయని గానీ.. సమస్యను మరింత తీవ్రతరం చేస్తాయగలవని గానీ ఎటువంటి ఆధారాలు లేవు. అయితే, అధిక మొత్తంలో కొవ్వు తీసుకోవడం మధుమేహం రోగులకు హానికరం. సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది.

తక్కువ కొవ్వు..

పాలలో కొవ్వు అధికంగా ఉండటం వల్ల పాలను తాగొద్ద? అంటే.. తాగొద్దని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. వెబ్‌ఎమ్‌డి నివేదిక ప్రకారం.. డయాబెటిక్ రోగులు కొవ్వు రహిత పాలు మాత్రమే తాగాలని సూచిస్తున్నారు. ప్రతి వ్యక్తి శరీరం భిన్నంగా ఉంటుంది. అందుకే.. పాలు తాగిన తరువాత రక్తంలో చక్కెర స్థాయిని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.

మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎన్ని పాలు తాగాలి..?

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉన్న వ్యక్తులు ఒక గ్లాస్ కంటే ఎక్కువ పాలు తాగకూడదు. రోజుకు 190 ఎంఎల్ మిల్క్ తీసుకుంటే సరిపోతుంది. కొందరు పాలు, పాల ఉత్పత్తుల కారణంగా ఎలర్జీ వస్తుంది. అలాంటి సమస్యలు ఉంటే.. పాలు, పాల ఉత్పత్తుల జోలికి వెళ్లకుండా ఉండాలి.

Updated Date - 2024-02-09T18:04:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising