ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Navya : రోజుకు ఎన్ని పోషకాలు?

ABN, Publish Date - May 21 , 2024 | 12:13 AM

ఆహారంలో సరిపడా పోషకాలున్నప్పుడే అది సమతులాహారం అవుతుంది. అందుకోసం శాకాహారులైతే రోజు మొత్తంలో 250 గ్రాముల తృణధాన్యాలు, 400 గ్రాముల కూరగాయలు, వంద గ్రాముల పండ్లు, 85 గ్రాముల పప్పుదినుసులు, 35 గ్రాముల నట్స్‌, 27 గ్రాముల కొవ్వులు, నూనెలు, 300 గ్రాముల పాలు/పెరుగు తీసుకోవాలి.

తెలుసుకుందాం

మాంసాహారులైతే 260 గ్రాముల తృణధాన్యాలు, 400 గ్రాముల కూరగాయలు, 100 గ్రాముల పండ్లు, 55 గ్రాముల పప్పుదినుసులు, 70 గ్రాముల చికెన్‌/మాంసం, 30 గ్రాముల నట్స్‌, సీడ్స్‌, 27 గ్రాముల కొవ్వులు, నూనెలు, 300 గ్రాముల పాలు/పెరుగు తీసుకోవాలి. అలాగే ఆహారంలోని పోషకాలు నష్టపోకుండా అదే పనిగా బియ్యం, పప్పుదినుసులను నీళ్లలో కడగకూడదు.

అలాగే కూరగాయలు, పండ్లను చిన్న చిన్న ముక్కలుగా కోసుకోకుండా, పెద్దవిగా కోసుకోవాలి. కోసిన వెంటనే వండుకోవాలి, లేదా తినేయాలి. గిన్నెల మీద మూత ఉంచి వండుకోవాలి. లేదా కుక్కర్‌లో ఉడికించుకోవాలి. ఓవెన్‌లో వంట గురించి కొందరికి అపోహలుంటాయి. సంప్రదాయబద్ధమైన వంట విధానాల్లో జరిగే పోషక నష్టానికీ, మైక్రోఓవెన్‌లో జరిగే పోషక నష్టానికి వ్యత్యాసం ఎంతో తక్కువ.

Updated Date - May 21 , 2024 | 12:14 AM

Advertising
Advertising