Health Tips : స్మూతీస్లో అరటిపండు ఉపయోగించకపోవడానికి కారణాలేంటి..
ABN, Publish Date - May 14 , 2024 | 01:43 PM
అల్పాహారంగా, పోషకాలు కలిగిన చిరుతిండిగా ఎంచుకునే స్మూతీలు చాలా ఆరోగ్యకరమైన పదార్థంగా పేరుపొందాయి. ఈ ఆహారంలో ప్రధానమైనవి పండ్లు, కూరగాయలను చేర్చడానికి అవి అనుకూలమైనవి.
ఏదైనా ఆహారం మనం తీసుకుంటున్నామంటే అది అధికంగా శరీరానికి మేలు చేసేదే అయి ఉంటుంది. కానీ కొన్ని పదార్థాలు శరీరంలో చేరి విపరీతాలు తెచ్చే వరకూ తెచ్చుకోకూడదు. ఏది తింటే అది శరీరానికి మంచి చేస్తుందనే అవగాహన అందరిలోనూ ఉండాలి. శరీరానికి కొన్ని పదార్థాలు మాత్రమే సరిపడతాయి. కొన్నింటిని దూరం పెట్టాల్సిందే. చేటు చేస్తాయని తెలిసి కూడా వాటిని తీసుకుంటే అది విపరీతమైన ప్రభావాన్నే చూపిస్తుంది.
ముఖ్యంగా ఇష్టంగా తాగే జ్యూస్, స్మూతీల సంగతికే వస్తే.. అరటి పండు అందరికీ నచ్చిన పండే.. తినగానే కడుపునిండిన ఫీలింగ్ ఉంటుంది. మరి దీనితో చేసే స్మూతీలు ఎందుకు తినకూడదు. కొన్ని రకాల పండ్లతో ఎందుకు కలపకూడదో చూద్దాం.
అల్పాహారంగా, పోషకాలు కలిగిన చిరుతిండిగా ఎంచుకునే స్మూతీలు చాలా ఆరోగ్యకరమైన పదార్థంగా పేరుపొందాయి. ఈ ఆహారంలో ప్రధానమైనవి పండ్లు, కూరగాయలను చేర్చడానికి అవి అనుకూలమైనవి. ఓ అధ్యయనంలో బెర్రీలు, అరటిపండ్లు కలిపి చేసే స్మూతీ కారణంగా అందులోని బయోయాక్టివ్ సమ్మేళనాల సమూహమైన ఫ్లేవనోల్స్ ను 84శాతం తగ్గిస్తాయట. అరటి పండు స్మూతీలకు నప్పదు అనేది ఇందుకే. అరటిపండ్లు ఫ్లేవనోల్స్ తో కలపకూడదనేనది ఇది సూచిస్తుంది.
Tooth Health : పంటి ఆరోగ్యం కోసం ఈ పదార్థాలను దూరం పెట్టడమే సరైన పని..!
ఫ్లావనాల్ అధికంగా ఉండే పండ్లలో సాధారణంగా యాపిల్స్, ద్రాక్ష, బేరి, టీ, కోకో, బెర్రీలు ఉంటాయి. బయోయాక్టివ్ సమ్మేళనాలు గుండె, మెదడు ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటాయి. పాలీఫెనాల్ ఆక్సిడేస్ ఆపిల్, బెర్రీలలో కూడా కనిపిస్తుంది. కానీ ఇది తక్కువ పరిమాణంలో ఉంటుంది. యాపిల్ ముక్కలు, అరటిపండు కలిపి స్మూతీ చేస్తే అది గోధుమ రంగులోకి మారుతుంది. ఆహారాలలో ఉండే పాలీఫెనాల్ ఆక్సిడేస్ గాలి తగిలినప్పుడు ఇలా రంగు మారతాయి
మీరు కనక అరటి పండుతో స్మూతీలు ఇష్టపడితే దానిని బెర్రీలు, ద్రాక్ష, కోకో వంటి ఫ్లెవనాల్ అధికంగా ఉండే పండ్లతో కలిపి చేయకూడదు. బీట్ గ్రీన్, అధిక PPO ఉండే పండ్లు, కూరలకు కూడా ఇదే వర్తిస్తుంది. అంటే అధిక PPO ఉండే యాక్టివిటీ ఉండే పండ్లతో స్మూతీస్ కలపడం వల్ల చెడు కలయిక అవుతుంది.
Read Latest Navya News and Thelugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.
Updated Date - May 14 , 2024 | 01:43 PM