ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Health Tips : వానాకాలంలో జలుబు, దగ్గుకు లవంగాలతో చెక్ పెట్టేదెలా..!

ABN, Publish Date - Aug 05 , 2024 | 02:04 PM

జలుబు, దగ్గు ఓ పట్టాన తగ్గవు. వీటిని నివారించాలంటే పడుకునే సమయంలో రెండు లవంగాలను తీసుకుంటే మంచి ఉపశమనం దొరుకుతుంది.

Health Benefits

మనం రోజువారి తీసుకునే ఆహారంలో ఔషధ గుణాలున్న పదార్థాలు అనేకం ఉన్నాయి. వాటిలో మసాలా దినుసైన లవంగాల విషయానికి వస్తే లవంగం అనేక ఆరోగ్య సమస్యల నుంచి రక్షణనిస్తుంది. చిన్నగా, కనిపించే లవంగాలు రుచికి కాస్త ఘాటుగా ఉన్నా కూడా ఇందులోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలతో పాటు విటమిన్ ఇ, విటమిన్ సి, ఫోలెట్, రిబోఫ్లావిన్, విటమిన్ ఎ, థయామిన్, విటమిన్ డి వంటి గుణాలున్నాయి. లవంగాలను రాత్రి సమయంలో తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటంటే..

లవంగాన్ని మసాలాగా వంటకాల్లో వాడుతూ ఉంటాం. ఇది పదార్థాలకు మంచి రుచిని ఇవ్వడమే కాకుండా పోషకాలను కూడా అందిస్తుంది. లవంగం శాస్త్రీయ నామం సిజిజియం అయోమాటికమ్.. వీటిని క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల కడుపు, దంతాలు, గొంతు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

లవంగంలో ఉండే యూజినాల్ ఒత్తిడి నుంచి జీర్ణ సమస్యల నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది.

రాత్రి పూట లవంగాలను తీసుకంటే..

రాత్రి పడుకునే సమయంలో లవంగాలను తీసుకుంటే మలబద్దకం సమస్య ఉండదు. విరేచనాలు, అసిడిటీ వంటి కడుపు సమస్యలు కూడా తగ్గుతాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

తాజా శ్వాసకు సహకరిస్తుంది. నోటి శుభ్రతతో పాటు, దంతాలు దృఢంగా ఉంటాయి. గోరు వెచ్చని నీటితో లవంగాలను తీసుకున్నట్లయితే పిప్పి పన్ను నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.

రాత్రి సమయాల్లో లవంగం తింటే ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్, సాలిసైలేట్ గుణాలు మొటిమలను నివారించడంలో సహకరిస్తాయి.


Health Tips : జికా వైరస్ అంటే ఏమిటి? దోమకాటును నివారించాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలి..!

లవంగం గొంతు నొప్పి, దగ్గు, జలుబు నుంచి కూడా ఉపశమనాన్ని అందిస్తుంది.

తలనొప్పి బాగా ఉన్నట్లయితే రాత్రి పడుకునే ముందు లవంగాలను తింటే తలనొప్పి తగ్గుతుంది.

జలుబు, దగ్గు ఓ పట్టాన తగ్గవు. వీటిని నివారించాలంటే పడుకునే సమయంలో రెండు లవంగాలను తీసుకుంటే మంచి ఉపశమనం దొరుకుతుంది. లవంగాలను నమలడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.


Health Tips : ముఖం, కళ్లపై కనిపించే గుండెపోటుకు సంబంధించిన సంకేతాలు తెలుసా..

వైరల్ జ్వరాలు, ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమం పొందాలన్నా కూడా లవంగాలు చక్కగా పనిచేస్తాయి. ఆయాసం, ఇన్పెక్షన్ తగ్గుతాయి. లవంగాలను అలానే తినలేనివారు, వాటిని దంచి పొచి చేసి రాత్రి సమయంలో పడుకునే ముందు గోరువెచ్చని నీటిలో లవంగాల పొడిని వేసి కలిపి తీసుకున్నా ఫలితం ఉంటుంది.

Read Latest Navya News and Telugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Aug 05 , 2024 | 02:05 PM

Advertising
Advertising
<