ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Navya : శరీరం షాక్‌కు గురైతే?

ABN, Publish Date - Jun 18 , 2024 | 12:00 AM

షాక్‌ అనేది ప్రాణాంతకమైన పరిస్థితి. సరిపడా రక్తప్రసరణ జరగనప్పుడు శరీరం షాక్‌కు గురవుతుంది. సాధారణంగా ఐదు ప్రధాన షాక్‌లకు శరీరం గురవుతూ ఉంటుంది. అవేంటంటే....

అవేర్‌నెస్‌

షాక్‌ అనేది ప్రాణాంతకమైన పరిస్థితి. సరిపడా రక్తప్రసరణ జరగనప్పుడు శరీరం షాక్‌కు గురవుతుంది. సాధారణంగా ఐదు ప్రధాన షాక్‌లకు శరీరం గురవుతూ ఉంటుంది. అవేంటంటే....

  • అనాఫిలాక్టిక్‌ షాక్‌: అలర్జీ వల్ల శరీరం షాకు గురయ్యే పరిస్థితి ఇది. పెన్సిలిన్‌, లేటెక్స్‌, తేనెటీగలు, నట్స్‌, షెల్‌ఫిష్‌ లాంటి పదార్థాలతో తలెత్తే షాక్‌లు ఈ కోవలోకి వస్తాయి.

  • కార్డియోజెనిక్‌: హార్ట్‌ అటాక్‌ సమయంలో శరీరం షాక్‌కు గురయ్యే పరిస్థితి ఇది. అకస్మాత్తుగా గుండె వేగం పెరిగిపోయి, శ్వాస హెచ్చతగ్గులకు లోనవుతుంది. చర్మం పాలిపోతుంది. విపరీతమైన చమటలు ఉంటాయి. మూత్రవిసర్జన ఆగిపోతుంది.

  • హైపోవోలమిక్‌: శరీరం 20ు అంతకు మించి రక్తాన్ని కోల్పోయినప్పుడు, ఈ షాక్‌కు గురవుతుంది. విపరీతమైన రక్తస్రావం. చమట, తల తిరుగుడు, అయోమయం, శ్వాస నెమ్మదించడం లాంటి లక్షణాలు ఉంటాయి. ఒకవేళ అంతర్గత రక్తస్రావమైతే, నలుపు రంగులో రక్తంతో కూడుకున్న మలం, పొట్ట నొప్పి, రక్తపు వాంతులు లాంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.

  • న్యూరోజెనిక్‌: కేంద్రనాడీ వ్యవస్థ పాత్‌వేస్‌, మరీముఖ్యంగా వెన్నెముకకు దెబ్బతిన్నప్పుడు తలెత్తే షాక్‌ ఇది. ఇలాంటప్పుడు రక్తపోటు పడిపోయి, చర్మం ఎరుపు రంగులోకి మారుతుంది. గుండె కొట్టుకునే వేగం తగ్గుతుంది.

  • సెప్టిక్‌: బ్యాక్టీరియా, వైరస్‌ లేదా ఫంగస్‌ వల్ల శరీరం మొత్తం ఇన్‌ఫెక్షన్‌కు గురైతే శరీరం సెప్టిక్‌ షాక్‌కు గురవుతుంది. ఈ పరిస్థితినే సెప్సిస్‌ అంటారు. మూత్రవిసర్జన తగ్గడం, అయోమయం, మత్తు, శ్వాసకోశ సమస్యలు, జ్వరం ఉంటాయి.

Updated Date - Jun 18 , 2024 | 12:00 AM

Advertising
Advertising