Health Tips : పిల్లల్లో ఫ్యాటీ లివర్ వ్యాధి పెరగడానికి ముఖ్య కారణాలు ఏంటి..!
ABN, Publish Date - Aug 08 , 2024 | 01:10 PM
ఆహారపు అలవాట్లు సరిగాలేకపోవడం, శారీరక శ్రమలేకపోవడం వల్ల కాలేయ వ్యాధి వస్తుంది. పది సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల్లో కూడా వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది.
పిల్లలు ఎంత ఆడుకుంటే అంత ఆరోగ్యంగా ఉంటారు. ఇప్పటి రోజుల్లో స్కూలుకు వెళ్ళే పిల్లలు రోజంతా చదువులతో కుస్తీ పట్టి రావడమే తప్పితే, ఆటలు ఆడేందుకు సమయం లేకుండా పోతుంది. రోజంతా కూర్చుని ఉండటం, జంక్ ఫుడ్‌కి అలవాటు పడటం కారణంగా అనేక అనారోగ్య సమస్యలు చిన్న వయసులోనే వస్తున్నాయ్. పిల్లల్లో శరీరక కదలికలు సరిగా లేకపోవడం కారణంగా బాల్యంలోనే కాలేయ వ్యాధి సమస్య వెంటాడుతుంది. దీనికి పరిష్కారాలను తెలుసుకుందాం.
ఆరు గంటల కంటే ఎక్కువ సమయం కూర్చుని ఉండే పిల్లల్లో కాలేయ వ్యాధి పెరుగుతుంది. ఎక్కువ సమయం కదలకుండా కూర్చోవడం వల్ల కాలేయంలో కొవ్వు పేరుకుంటుంది. ఇది స్థూలకాయం, అధిక రక్తపోటు, మెటబాలిక్ సిండ్రోమ్ వంటి వాటితో ముడిపడి ఉంటుంది. ఒకే గదిలో లేక కంప్యూటర్, ట్యాబ్, ఫోన్ వీటితో కదలకుండా కూర్చోవడం వల్ల కాలేయం దెబ్బతింటుంది.
ఒకప్పటితో పోలిస్తే పిల్లల్లో శారీరక శ్రమ చేసే అవకాశం తక్కువగా ఉండటం, సరైన జీవన శైలి లేకపోవడం, చదువు ఒత్తిళ్ళు, నిద్ర సరిగా లేకపోవడం, స్కూల్ పరిసరాల్లో ఆటలాడేందుకు స్థలం లేకపోవడం, సమతుల్య ఆహారానికి బదులుగా జంక్ ఫుడ్స్ తీసుకోవడం కూడా కాలేయ వ్యాధి ప్రమాదాన్ని పెంచుతున్నాయి.
Festival Time : హరియాలీ తీజ్ వేడుకల్లో ఖీర్ ఎందుకు చేస్తారు?
ఆరు గంటల నిద్ర లేకపోతే..
చదువుకునే పిల్లలు ఆరు గంటల సమయం నిద్రపోవాలి. పడుకునే సమయంలో స్క్రీన్‌కు దూరంగా ఉండాలి. ఇలా లేని పిల్లల్లో కొవ్వు కాలేయ వ్యాధి, లివర్ సిర్రోసిస్ వచ్చే ప్రమాదం గణనీయంగా పెరిగిందని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఫ్యాటీ లివర్ వ్యాధి..
పిల్లల్లో కాలేయంలో అధిక కొవ్వు (ట్రైగ్లిజరైడ్స్) పేరుకున్నప్పుడు సాధారణంగా కొవ్వు కాలేయ వ్యాధి వస్తుంది.
పిల్లల్లో కాలేయ వ్యాధికి కారణాలేంటి..
ముఖ్యంగా ఆహారపు అలవాట్లు సరిగాలేకపోవడం, శారీరక శ్రమలేకపోవడం వల్ల కాలేయ వ్యాధి వస్తుంది. పది సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల్లో కూడా వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది.
Health Tips : ఖాళీ కడుపుతో ఉదయాన్నే నీరు తాగడం ఆరోగ్యమేనా..!
వ్యాధికి ప్రమాద కారకాలు..
1. ఊబకాయం
2. ఇన్సులిన్ నిరోధకత
3. టైప్ 2 డయాబెటిస్
4. అధిక కొలెస్ట్రాల్
5. ఊబకాయంతో బాధపడే పిల్లల్లో ఫ్యాటీ లివర్ వ్యాధి వచ్చే అవకాశం 38శాతం వరకూ ఉంటుంది.
6. కాలేయ వ్యాధి జన్యుపరమైన కారణాలతో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రుల్లో ఉన్నట్లయితే వారసత్వంగా పొందే అవకాశం ఉంటుంది.
పిల్లలు శారీరక శ్రమ ఉండే ఆటలు ఆడినప్పుడు, సరైన సమయానికి నిద్ర, సమతుల్య ఆహారం తీసుకోవడం. జీవనశైలిలో తగిన మార్పుల ద్వారా కొవ్వు కాలేయ వ్యాధిని తగ్గించుకోవచ్చు.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.
Updated Date - Aug 08 , 2024 | 01:11 PM