If My Cry is Loud - Put Ear Plugs : విమానంలో వినూత్న ప్రయోగం!
ABN, Publish Date - Aug 19 , 2024 | 01:44 AM
విమానాల్లో ప్రయాణించే సమయాల్లో పిల్లలు ఏడ్వటం.. వాళ్లను తల్లులు, అమ్మమ్మలు సముదాయించటం మనకు చాలా సార్లు కనిపిస్తూ ఉంటుంది.
విమానాల్లో ప్రయాణించే సమయాల్లో పిల్లలు ఏడ్వటం.. వాళ్లను తల్లులు, అమ్మమ్మలు సముదాయించటం మనకు చాలా సార్లు కనిపిస్తూ ఉంటుంది. విమానంలో ప్రయాణించే కొందరు ప్రయాణికులకు - ఈ వ్యవహారమంతా ఇబ్బందిగా ఉంటుంది. ముఖ్యంగా అంతర్జాతీయ విమానాలలో పిల్లలు ఏడుస్తుంటే ఇతరులు చిరాకు పడతారు. అందుకే దక్షిణ కొరియాకు చెందిన ఒక మహిళ ఒక వినూత్న ప్రయోగం చేసింది. ఈ మహిళ దక్షిణ కొరియా నుంచి అమెరికాకు తన నాలుగు నెలల పాపను తీసుకు వెళ్తోంది. ఆ పాప వల్ల కలిగే అసౌకర్యానికి చింతించమంటూ తాను ప్రయాణిస్తున్న విమానంలోని 200 మంది ప్రయాణికులకు - బ్యాగులు పంచిపెట్టింది. ప్రతి బ్యాగులో- ఇయర్ ప్లగ్స్, చ్యూయింగ్ గమ్‌తో పాటు ఒక చిన్న సందేశం కూడా ఉంది. ఈ సందేశంలో - ‘‘హాయ్! నా పేరు జున్ వూ. నాకు నాలుగు నెలలు. నేను మా అమ్మ, అమ్మమ్మలతో కలిసి అమెరికా వెళ్తున్నాను. ఇది నా తొలి విమాన ప్రయాణం. చాలా భయంగా ఉంది. వీలైనంత వరకు ఏడ్వకుండా ఉండటానికి ప్రయత్నిస్తా. నా ఏడుపు పెద్దగా ఉంటే- ఇయర్ ప్లగ్స్ పెట్టుకోండి..’’ అని ఉంది.
Updated Date - Aug 19 , 2024 | 01:45 AM