మధుమేహాన్ని నియంత్రించాలంటే..
ABN, Publish Date - Nov 11 , 2024 | 02:25 AM
రోజూ మనం తీసుకునే ఆహారం నుంచి శరీరం గ్లూకోజ్‌ను గ్రహించి శక్తిగా మారుస్తుంది. ఇందుకు క్లోమగ్రంధి ఉత్పత్తి చేసే ఇన్సులిన్ సహాయం చేస్తుంది.
హెల్త్
రోజూ మనం తీసుకునే ఆహారం నుంచి శరీరం గ్లూకోజ్‌ను గ్రహించి శక్తిగా మారుస్తుంది. ఇందుకు క్లోమగ్రంధి ఉత్పత్తి చేసే ఇన్సులిన్ సహాయం చేస్తుంది. ఇన్సులిన్ సరిగా ఉత్పత్తి కాకపోయినా, ఉత్పత్తి అయినదాన్ని శరీరం ఉపయోగించుకోకపోయినా రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి మధుమేహం వస్తుంది. శారీరక వ్యాయామం లేకపోవడం, ఒత్తిడి, సమయానికి నిద్రపోకపోవడం, మద్యపానం తదితర కారణాలవల్ల మధుమేహం బారిన పడే అవకాశం ఉంది. దీని లక్షణాలు, ఇది రాకుండా వుండాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం!
జాగ్రత్తలు
ఫైబర్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారపదార్థాలు, ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే బీన్స్, పప్పు ధాన్యాలు, కొవ్వు తక్కువగా ఉండే పదార్థాలు, కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండే జామకాయ, పుచ్చకాయ, బొప్పాయి, నారింజలను తీసుకోవాలి. ఆకుకూరలు, చిరుధాన్యాలు, బాదాం, వాల్‌నట్స్ తప్పకుండా తినాలి. అప్పుడే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. వారానికి రెండు సార్లు ఉపవాసం మంచి ఫలితాన్నిస్తుంది. ఒకేసారి ఎక్కువగా తినకుండా తక్కువ పరిమాణంలో ఎక్కువసార్లు తినడం ప్రయోజనకరం.
చక్కెర, బెల్లంతో చేసిన పదార్థాలు, తేనె, కొబ్బరినీళ్లు, అరటి, మామిడి, సపోటా, సీతాఫలం, ద్రాక్ష, పనస పండ్లను తినకూడదు.
నేచురల్ ఇన్సులిన్‌గా పనిచేసే తిప్పతీగ రసం, మునగ ఆకు టీ, వేప ఆకు రసం, అశ్వగంధ ఆకుల రసం, కలబంద రసం తీసుకోవడం వల్ల కూడా మధుమేహాన్ని నియంత్రణలో ఉంచవచ్చు.
లక్షణాలు
తరచూ మూత్ర విసర్జన, విపరీతమైన ఆకలి, ఎప్పుడూ నీరసంగా ఉండడం, అధిక దాహం, శరీరంపై గాయాలు మానకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చిగుళ్ల వ్యాధులు, చర్మ వ్యాధులు, కంటి చూపు మందగించడం, పాదాల నొప్పులు కూడా ఉంటాయి.
Updated Date - Nov 11 , 2024 | 02:26 AM