ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Littles: తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు

ABN, Publish Date - Jun 27 , 2024 | 12:25 AM

ఒక ఊరిలో వీరయ్య, రాజయ్య అనే ఇద్దరు రైతులు ఉండేవారు. వీరయ్య ఎల్లపుడూ అందరి తప్పులుసరిదిద్దుతూ., సలహాలు చెబుతూ ఉండేవాడు.

క ఊరిలో వీరయ్య, రాజయ్య అనే ఇద్దరు రైతులు ఉండేవారు. వీరయ్య ఎల్లపుడూ అందరి తప్పులుసరిదిద్దుతూ., సలహాలు చెబుతూ ఉండేవాడు.రాజయ్య వీరయ్యతో ప్రతి చిన్న విషయానికి అందరినీ నొప్పించడం మంచిది కాదని చెబుతూ ఉండేవాదు. ఇలా చాలా కాలం గడిచిన తర్వాత అందరికీ వీరయ్య సలహాలు వినీవినీ విసిుగు కలిగింది. అందరి ముందూ వీరయ్య త మను అవమాన పరచడం చూసి, ప్రజలకు బాధ కలిగింది. వారంతా గ్రామ పెద్దతో తమ బాధను చెప్పుకున్నారు. గ్రామ పెద్ద వీరయ్యను పిలిచి, ఆ మర్నాటినుండి రాజయ్య పొలంలో కలుపు తీయాలని చెప్పాడు.

తన తెలివినీ, పనితనాన్ని అందరూ గుర్తించారని, కాబట్టే రాజయ్య పొలం బాధ్యత కూడా తనకే అప్పగించారని ఆనందించాడువీరయ్య. కొన్ని రోజులకు వీరయ్య వచ్చి, రాజయ్య పొలంలో కలుపు ఇక తాను తీయలేననీ, రాజయ్య తన పని తానే, చేసుకునేట్లు చూడ వలసిందనీ, రాజయ్య పొలంలో కలుపు తీస్తూ ఉంటే తన సొంత పొలంలో కలుపు మొక్కలు పెరిగి పోతున్నాయి కాబట్టి, ఇక తనా పనిని చేయలేనని గామ పెద్దతో చెప్పుకున్నాడు. దానికి గ్రామ పెద్ద, ‘నిజమే కదా ఎవరి పొలంలో కలుపు వారే తీసుకోవాలి. అలాగేఎవరి తప్పులు నెమ్మదిగా వారే దిద్దుకుంటారు.. నిరంతరం నువ్వు ఇతరుల తప్పులనే దిద్దుతూ ఉంటే నిన్ను నువ్వు దిద్దుకునేది ఎపుడు?’ అన్నాడు. ఆ రోజు నుండి వీరయ్య ప్రతి చిన్న దానిలో అందరిలో తప్పులు వెతకడం మానుకున్నాడు.

Updated Date - Jun 27 , 2024 | 12:25 AM

Advertising
Advertising