Skin Care: ఈ ఒక్క చిట్కాతో పగులుతున్న మీ చర్మం మెరిసిపోతుంది...
ABN, Publish Date - Nov 13 , 2024 | 12:31 PM
చలికాలంలో మీ చర్మం పగులుతుందా? అయితే, చర్మం పగుళ్లకు కారణాలు ఏంటి? ఎలా స్కిన్ కేర్ తీసుకోవాలి? అనే విషయాలను తెలుసుకుందాం..
Skin Care: చలికాలం వచ్చిందంటే చాలు అమ్మాయిలు ఎక్కువగా చర్మ సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ఎందుకంటే స్కిన్ పొడిబారి తన మెరుపును కోల్పోతుంది. అందరిలా మీ చర్మం కూడా పగులుతుందా? అయితే, చర్మం పగుళ్లకు కారణాలు ఏంటి? ఎలా స్కిన్ కేర్ తీసుకోవాలి? అనే విషయాలను తెలుసుకుందాం..
పగుళ్లకు కారణాలు:
చలి కారణంగా స్కిన్ తేమ తగ్గిపోతుంది. అలాగే వాతావరణం కారణంగా వాటర్ తక్కువగా తీసుకుంటారు కాబట్టి స్కిన్ డిహైడ్రేట్ అవుతుంది. అంతేకాకుండా వేడి నీటితో స్నానం చేయడం వల్ల చర్మంలోని సహజ తేమ తొలగిపోతుంది. పొడి చర్మంపై కఠినమైన రసాయనాలు యూజ్ చేయడం వల్ల స్కిన్ మరింతగా పాడవుతుంది. విటమిన్ ఎ, సి, డి లోపం వల్ల కూడా స్కిన్ పగులుతుంది.
పాలు ఎంతో మేలు..
చలికాలంలో ముఖానికి సరైన స్కిన్ కేర్ తీసుకోవాలి. ఇంట్లోనే కొన్ని రకాల ఇంటి చిట్కాలతో స్కిన్ కేర్ రొటీన్ ప్రారంభించవచ్చు.. సహజ సిద్ధమైనది కాబట్టి ఎలాంటి చర్మ సమస్యలు, ఇన్ఫెక్షన్లు కూడా ఉండవు. చలికాలం సరైన స్కిన్ కేర్ రొటీన్ లో పాలను ముఖ్యంగా చేర్చుకోవాలి. ఎందుకంటే ఇందులో విటమిన్ డి ఉంటుంది. లాక్టిక్ యాసిడ్ కూడా ఉండటం వల్ల మీ చర్మం మెరుస్తూ ఉంటుంది. పాలతో చర్మాన్ని ఎలా మెరిపించుకోవచ్చో తెలుసుకుందాం..
సన్ స్ర్కీన్ లా..
పాలలో గ్లిజరిన్ కలిపి ముఖానికి కాటన్ బాల్‌తో అప్లై చేసుకోవాలి. కాసేపు అలాగే మసాజ్ చేసుకుంటూ ఉండాలి. 20 నిమిషాల తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పొడిబారిన చర్మానికి చెక్ పెట్టవచ్చు. అంతేకాకుండా మీ ముఖం కూడా మెరిసిపోతుంది. పాలు ఫేస్‌కు సహజసిద్ధమైన సన్ స్ర్కీన్ లా పనిచేస్తుంది. హానికరమైన యూవీ కిరణాల నుంచి మన శరీరాన్ని కాపాడుతుంది. ముఖానికి మంచి మాయిశ్చరైజర్ అందుతుంది. శనగ పిండితో కూడా పాలను కలిపి ముఖానికి ఫేస్ ప్యాక్ వంటివి చేసుకోవచ్చు. దీని వల్ల కూడా మీ చర్మం మెరుస్తుంది.
వారికి మంచిది కాదు..
పాలలో ఉండే విటమిన్ ఏ, బి వల్ల మీ చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. వృద్ధాప్య సమస్యలు రావు. నేచురల్ గా మెరుస్తారు. అయితే, పచ్చి పాలు జిడ్డు చర్మం ఉన్న వారు వాడకపోవడం మంచిది. ఏవైనా ఫేస్ ప్యాక్ లు వేసుకోవాలంటే జిడ్డు చర్మం ఉన్నవారు పాలకు బదులు రోజ్ వాటర్ మిక్స్ చేసుకోవచ్చు.
(Note: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు.)
Updated Date - Nov 13 , 2024 | 12:31 PM