ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Navya : వివేకి- మూర్ఖుడు

ABN, Publish Date - Jul 12 , 2024 | 12:19 AM

ఇద్దరు వ్యక్తులు సముద్రంలో చిక్కుకున్నారు. తీరానికి కొంత దూరంగా ఉన్న ఒక రాతి మీదకు చేరుకున్నారు. చీకట్లు కమ్ముకుంటున్నాయి.

సద్బోధ

ఇద్దరు వ్యక్తులు సముద్రంలో చిక్కుకున్నారు. తీరానికి కొంత దూరంగా ఉన్న ఒక రాతి మీదకు చేరుకున్నారు. చీకట్లు కమ్ముకుంటున్నాయి. ఆకాశంలో మబ్బులు ముసురుకుంటున్నాయి. తీరంలో ఉన్నవేవీ కనిపించడం లేదు. కెరటాలు ఉధ్ధృతంగా వచ్చి... రాళ్ళను ఢీకొని వెనక్కి పోతున్నాయి. సముద్రం కల్లోలంగా ఉంది.

ఇంతలో వేరొక వ్యక్తి వారిని సమీపించాడు. ‘‘నాతో రండి. మిమ్మల్ని తీరానికి చేరుస్తాను’’ అని అన్నాడు.

వారిలో వివేకవంతుడైన వ్యక్తి... అతనితో వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. కానీ మూర్ఖుడైన వ్యక్తి సందేహిస్తూ ‘‘ఈ నీళ్ళలోంచీ మమ్మల్ని నువ్వెలా బయటకు తీసుకువెళ్తావు?’’ అని ప్రశ్నించాడు.

‘‘పడవను నాతో తీసుకువచ్చాను’’ అన్నాడు కొత్త వ్యక్తి.

‘‘నీతో రావడానికి నేను సిద్ధమే’’ అన్నాడు వివేకవంతుడు.

‘‘లేదు. నేను రాను. బహుశా పడవలో ఏదైనా లోపం ఉండొచ్చు. లేదా ఈ మనిషి దోపిడీదారు కావచ్చు’’ అన్నాడు మూర్ఖుడు.

తెలివైన మనిషి పడవలో ఎక్కాడు. పడవ నడిపే వ్యక్తి మార్గదర్శకత్వంలో... తీరానికి సురక్షితంగా చేరాడు. ఇంతలో... సముద్రంలో కెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. మూర్ఖుడు నీళ్ళలో పడి మునిగిపోయాడు.

ఎన్నో జన్మల తరువాత... మానవ జన్మ అనే వరాన్ని పొందిన జీవుడు... సంసారం అనే సముద్రంలో కొట్టుకుపోతూ ఉంటాడు. సురక్షితమైన తీరాన్ని చేరుకోలేక సతమతమవుతూ ఉంటాడు. కాలం ప్రవహిస్తూ ఉంటుంది. జీవితం చరమాంకానికి చేరుకుంటుంది. కంటి చూపు తగ్గిపోతుంది.

భౌతిక ప్రపంచాన్నే పట్టుకొని పాకులాడడం, సామరస్యత లేకపోవడం అనే మబ్బులు జ్ఞాన నేత్రాన్ని మూసేస్తాయి. అప్పుడు కలవరపాటుతో ప్రార్థిస్తూ మానవుడు అనిశ్చితి అనే శిల మీద నిలబడి ఉంటాడు.


భగవన్నామం లేదా భక్తి అనే పడవలో గురువు అతని దగ్గరకువస్తాడు. తనను అనుసరించి, నావను ఎక్కి, భవసాగరాన్ని దాటి సురక్షితంగా ఒడ్డుకు చేరుకోవాలని బోధిస్తాడు.

వివేకవంతుడైన మనిషి అందుకు తక్షణమే సిద్ధమవుతాడు. కానీ మూర్ఖుడికి వెయ్యి సందేహాలు, లక్ష అనుమానాలు ఉంటాయి. గురువు చిత్తశుద్ధిని, భక్తి ప్రామాణికతను అతను ప్రశ్నిస్తాడు. త్వరలోనే మళ్ళీ మరోసారి అతను సంసారమనే మహా సముద్రంలో పడిపోతాడు. దానిలో మునిగిపోతాడు. తనను భగవంతుడికి సమర్పించుకోవడం ద్వారా... తనను తాను కాపాడుకొనే గొప్ప అవకాశాన్ని అతను కోల్పోతాడు.

- స్వామి శివానంద

Updated Date - Jul 12 , 2024 | 12:19 AM

Advertising
Advertising
<