ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Olympics 2024 : ఆట ఒక్కటే కాదు మనోబలమూ కావాలి

ABN, Publish Date - Aug 05 , 2024 | 12:55 AM

ఒలింపిక్స్‌ లాంటి మెగా పోటీల్లో గెలుపు... ఓటముల మధ్య తేడా సన్నని రేఖ మాత్రమే. అక్కడ ఎవరూ ఎక్కువ కాదు... ఎవరూ తక్కువా కాదు. నైపుణ్యంలో దాదాపు అందరూ సమానమే. కానీ బరిలో నిలిచి... అంచనాలను అందుకొనేది... ఒత్తిడిలో చిత్తవకుండా మానసికంగా దృఢంగా ఉన్నవారే.

ఒలిం‘పిక్స్‌’

ఒలింపిక్స్‌ లాంటి మెగా పోటీల్లో గెలుపు... ఓటముల మధ్య తేడా సన్నని రేఖ మాత్రమే. అక్కడ ఎవరూ ఎక్కువ కాదు... ఎవరూ తక్కువా కాదు. నైపుణ్యంలో దాదాపు అందరూ సమానమే. కానీ బరిలో నిలిచి... అంచనాలను అందుకొనేది... ఒత్తిడిలో చిత్తవకుండా మానసికంగా దృఢంగా ఉన్నవారే. ఇది అథ్లెట్లకు ఒలింపిక్స్‌ నేర్పిన పాఠం. అందుకే భారత్‌ కూడా క్రీడాకారుల బృందంతో తొలిసారి ఇద్దరు మహిళా మానసిక నిపుణులను ప్యారిస్‌ ఫ్లయిట్‌ ఎక్కించింది.

అవమానం కాదు

‘ఒకప్పుడు అథ్లెట్లు థెరపిస్టులను కలవడం అవమానంగా భావించేవారు. అయితే సమస్య ఉత్పన్నమైనప్పుడు దానికి పరిష్కార మార్గాల్ని అన్వేషించాలి. మానసిక నిపుణులను నియమించుకుని బైల్స్‌ సరైన నిర్ణయం తీసుకుంది. ఆమెలా అత్యున్నత స్థాయిలో పోటీపడే స్టార్‌ అథ్లెట్లు అందరికీ ఇది అవసరం. ఒలింపిక్స్‌ లాంటి ఈవెంట్లకు వారు మరింత ఆత్మవిశ్వాసంతో సన్నద్ధమవడానికి ఇది ఒక వరం. వాళ్ల విజయాల్లో అదీ ఒక భాగం’ అంటారు ఫ్రాన్స్‌కు చెందిన బైల్స్‌ కోచ్‌ సెసైల్‌ లాండీ.

కోట్లమంది తమపై పెట్టుకున్న అంచనాలు, అతిపెద్ద వేదికపై అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలనే ఉత్సుకత, మరోవైపు పతకాల వేటలో విఫలమవుతామేమోనన్న భయం, ఆందోళన... ప్రపంచ దేశాలన్నీ పోటీపడే మెగా ఈవెంట్‌లో అథ్లెట్లు ఎదుర్కొంటున్న మానసిక స్థితి ఇది. వారు మానసికంగా అంతటి బరువు మోయలేక... తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు.

వీటన్నిటి నుంచి బయటపడి, ఆటపై ఏకాగ్రత కుదరడానికి మానసిక నిపుణులను ఆశ్రయిస్తున్నారు. నిన్నమొన్నటి వరకు వ్యక్తిగత కోచ్‌లే క్రీడాకారులకు నైతిక స్థైర్యాన్ని ఇచ్చేవారు. కానీ కరోనా అనంతర పరిణామాలతో సైకాలజిస్టుల ఆవసరం తెలిసొచ్చింది. లక్ష్య సాధనలో నైపుణ్య శిక్షణ ఒక్కటే సరిపోదని, అత్యున్నత స్థాయిలో పోటీపడేటప్పుడు ఆందోళలను దూరం చేసేందుకు మానసికంగా శిక్షణ, ఆరోగ్యం కూడా అవసరమనే వాదన మొదలైంది.

టోక్యో ఒలింపిక్స్‌ సందర్భంగా దీనిపై విస్తృత స్థాయిలో చర్చ జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత ప్యారిస్‌ ఒలింపిక్స్‌లో తొలిసారి మెంటల్‌ హెల్త్‌ హెల్ప్‌లైన్‌ను అథ్లెట్లకు అందుబాటులోకి తెచ్చింది ‘అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ’ (ఐఓసీ). దీని కోసం ఒక యాప్‌నూ రూపొందించింది.

‘భారత ఒలింపిక్‌ అసోసియేషన్‌’ (ఐఓఏ) తన మెడికల్‌ టీమ్‌లో స్పోర్ట్స్‌ సైకాలజిస్ట్‌ దివ్యా జైన్‌, సైకియాట్రిస్ట్‌ డాక్టర్‌ సమీర్‌ పారిఖ్‌కు చోటు కల్పించింది. ఒక్క భారత్‌ మాత్రమే కాదు... ఈసారి తొంభైకి పైగా దేశాలు తమ అథ్లెట్ల బృందాలకు తోడుగా సైకాలజిస్టులను ప్యారి్‌సకు పంపించాయి.

‘క్రీడాకారులకు మానసిక మద్దతు అవసరమనే సంప్రదాయ ఆలోచన... వారు బరిలోకి దిగడానికి, అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి ఎంతో దోహదపడుతుంది. అందులో సందేహం లేదు. కానీ ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే అథ్లెట్లకు మానసిక ఆరోగ్యం కూడా ఎంతో ముఖ్యమని అర్థమవుతోంది. ఒలింపిక్స్‌ మెడికల్‌ టీమ్‌లో నాలాంటి మానసిక నిపుణులకు చోటు కల్పిచడం అతిపెద్ద ముందడుగు’ అంటారు ఫారిఖ్‌. ‘ఫోర్టిస్‌ నేషనల్‌ మెంటల్‌ హెల్త్‌ ప్రోగ్రామ్‌’ చైర్‌పర్సన్‌ అయిన ఫారిఖ్‌కు ఈ రంగంలో సుదీర్ఘ అనుభవం ఉంది.

‘అథ్లెట్లు దృఢచిత్తం కలవారనేది అందరి అభిప్రాయం. కానీ తమలోని భావోద్వేగాలను, మానసిక పోరాటాలను వ్యక్తం చేస్తే బలహీనమవుతామనే భావన వారిని ఆందోళనకు గురి చేస్తుంటుంది’ అంటారు ‘ఫోర్టిస్‌ నేషనల్‌ మెంటల్‌ హెల్త్‌ ప్రోగ్రామ్‌’ సైకలాజికల్‌ సర్వీసెస్‌ హెడ్‌ దివ్యా జైన్‌. ఫారిఖ్‌, దివ్యా ఒకే సంస్థ కోసం పని చేస్తున్నారు.


పరిస్థితులు మారాయి...

క్రీడల్లో ఒకప్పుడు నిషిద్ధ అంశంగా పరిగణించిన మానసిక ఆరోగ్యం ఇప్పుడు ప్రాధాన్య అంశంగా మారింది. మానసిక నిపుణులను సంప్రతించడానికి సందేహించే పరిస్థితి నుంచి వారిని వెంటబెట్టుకొని ఆటలకు వెళ్లే రోజులు వచ్చేశాయి.

టోక్యో ఒలింపిక్స్‌లో అమెరికన్‌ జిమ్నాస్టిక్స్‌ సూపర్‌స్టార్‌ సైమన్‌ బైల్స్‌ ఉదంతం సైకాలజిస్టుల ఆవశ్యకతను మరింత బలపరిచింది.

2016 రియో ఒలింపిక్స్‌లో నాలుగు స్వర్ణ పతకాలు గెలిచిన బైల్స్‌... టోక్యోలో తీవ్ర ఒత్తిడికి లోనై, పలు ఈవెంట్ల నుంచి తప్పుకుంది. హఠాత్తుగా పోటీల నుంచి వైదొలగడంతో సొంత దేశంలోనే ఆమెకు మద్దతు కరువైంది. అమెరికాకు రావల్సిన స్వర్ణ పతకాన్ని చేజార్చిందంటూ పలువురు ధ్వజమెత్తారు. ధైర్యం చెప్పేవారి కంటే విమర్శించినవారే అధికమయ్యారు. ఇవి బైల్స్‌ను మరింత కుంగదీశాయి.

ఈ అనుభవం ఆమెకు ఎన్నో పాఠాలు నేర్పింది. జిమ్మాస్టిక్స్‌ సాధన ఒక్కటే సరిపోదని, మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమని భావించింది. అప్పటి నుంచి తన సన్నద్ధతలో సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులను కూడా భాగం చేసింది. ‘ప్రతివారం థెరపి్‌స్టను కలవడం నా కెరీర్‌లో భాగం అయింది’ అంటున్న బైల్స్‌ ఇప్పుడు ప్యారి్‌సలో రెట్టించిన ఉత్సాహంతో ప్యారిస్‌లో మళ్లీ పతకాలు పట్టింది.


స్టార్‌ అథ్లెట్లు ఎందరో...

ఈ సమస్య బైల్స్‌ది మాత్రమే కాదు. అంతకముందు రికార్డు స్థాయిలో 28 ఒలింపిక్‌ పతకాలు గెలుచుకున్న అమెరికన్‌ స్విమ్మింగ్‌ సూపర్‌స్టార్‌ మైకేల్‌ ఫెల్ప్స్‌ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించాడు.

ఒలింపిక్స్‌ అనంతర ప్రచార కార్యక్రమాలతో తాను తీవ్ర మానసిక ఒత్తిడిలోకి వెళ్లిపోయేవాడినని ఓ సందర్భంలో వెల్లడించాడు. టోక్యో ఒలింపిక్స్‌లో ఐదు స్వర్ణ పతకాలు గెలుచుకున్న మరో అమెరికన్‌ స్విమ్మర్‌ కేలబ్‌ డ్రెసెల్‌... 2022 స్విమ్మింగ్‌ వరల్డ్‌ చాంపియన్‌షి్‌ప నుంచి అర్థంతరంగా తప్పుకున్నాడు.

అతడిదీ అదే సమస్య... మానసిక ఒత్తిడి. ఇప్పుడు మనోవికాస నిపుణుడితో కలిసి ప్యారిస్‌కు వెళ్లాడు. ఈ బృందంలో సభ్యురాలైన రేగా స్మిత్‌కూ థెరపిస్టు సాయం అవసరమైంది. 2019లో రెండు ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టిన ఆమె... ఆ తరువాత జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో తీవ్ర ఒత్తిడికి లోనై సాధారణ ప్రదర్శనతో సరిపెట్టుకుంది. ‘థెరపిస్టు సహాయం తీసుకోవాడానికి మొదట నేను ఎంతో సంకోచించాను. ఒక సందర్భంలో భయపడ్డాను కూడా.

చివరకు నాకు నేను నచ్చజెప్పుకుని సైకాలజిస్టును కలిశాను. ఆ తరువాతే నాకు అర్థమైంది... నేను ఇంతకాలంగా ఏ కోల్పోయానో’ అంటున్న స్మిత్‌... ప్యారిస్‌ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకంతో అదరగొట్టింది.

‘శారీరకంగా ఎంత దృఢంగా ఉన్నామో... మానసికంగా కూడా అంతే బలంగా ఉండడం అథ్లెట్లకు ముఖ్యం’ అనేది ఫ్రీస్టయిల్‌ స్ర్పింటర్‌ జాక్‌ అలెక్స్‌ మాట.

Updated Date - Aug 05 , 2024 | 12:56 AM

Advertising
Advertising
<