Navya: హోమ్‌వర్క్ ఇష్టంగా...
ABN, Publish Date - Jun 27 , 2024 | 01:34 AM
పిల్లలతో హోమ్‌వర్క్ చేయించటానికి తల్లితండ్రులు సతమతమయిపోతూ ఉంటారు. దగ్గరుండి చేయించలేక, ఆ వర్క్ తామే పూర్తి చేసి హమ్మయ్య...
పేరెంటింగ్
పిల్లలతో హోమ్‌వర్క్ చేయించటానికి తల్లితండ్రులు సతమతమయిపోతూ ఉంటారు. దగ్గరుండి చేయించలేక, ఆ వర్క్ తామే పూర్తి చేసి హమ్మయ్య... అని ఊపిరి పీల్చుకుంటూ ఉంటారు. ఇలా కాకుండా తమంతట తాము పిల్లలే ఇష్టంగా హోమ్‌వర్క్ చేసుకుపోయేలా చేయగల చిట్కాలున్నాయి. అవేంటంటే...
రోజూ స్కూలు నుంచి ఇంటికి రాగానే హోమ్‌వర్క్ చేయమని బలవంత పెట్టకుండా గంటపాటు పిల్లలని ఆటలాడనివ్వాలి.
ఆటల తార్వత సాన్నం చేయించి, హోమ్‌వర్క్ చేయమని పురమాయిస్తే కొత్త ఉత్సాహంతో ఇష్టంగా చేస్తారు.
కొందరు పిల్లలకి ఇంట్లో చదవటం, రాయటం నచ్చదు. ఇంట్లో ఉన్నంతసేపు తమకిష్టమైనట్టు ఉండాలని ప్రయత్నిస్తారు. ఇలాంటి పిల్లలకు హోమ్‌వర్క్ చేయమని చెబితే విసుగ్గా చూస్తారు. ఈరోజు స్కూల్లో ఏం చెప్పారు? ఏం రాయించారు? ఆ టీచర్ ఏం చెప్పింది? అని మాటల్లో పెట్టి పుస్తకాలు తీయించాలి.
అవసరమైతే దగ్గరుండి అనుమానాలను నివృత్తి చేయాలి.
ఒకసారి సహాయం చేసినా, రెండోసారి వాళ్లంతట వాళ్లే హోమ్‌వర్క్ పూర్తి చేసేలా చూడాలి.
ప్రతి రోజూ హోమ్‌వర్క్‌కు ఓ సమయాన్ని, స్థలాన్ని కేటాయించి దాన్నే ప్రతిరోజూ అనుసరించేలా చేయాలి.
ఎప్పుడైనా పిల్లలు హోమ్‌వర్క్ చేయటానికి నిరాకరిస్తే కారణం అడిగి తెలుసుకుని అందుకు తగ్గట్టు స్పందించాలి.
హోమ్‌వర్క్ చేయటం కూడా ఆటల్లో భాగంగా పిల్లలు ఇష్టంగా చేసే వాతావరణాన్ని కల్పించాలి.
Updated Date - Jun 27 , 2024 | 01:34 AM