ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Precautions : జుట్టు రాలిపోతుంటే...

ABN, Publish Date - Oct 19 , 2024 | 04:58 AM

నల్లని ఒత్తైన పొడవాటి జుట్టు ఉండాలని అమ్మాయిలంతా కోరుకుంటారు. కానీ ఆ ఆశ అందరికీ నెరవేరడం లేదు. వాతావరణ కాలుష్యం, పోషకాహార లోపం, ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి, రక్తహీనత వంటి కారణాల వల్ల యువతులు, మహిళలు జుట్టురాలే సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు పాటించాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం!

ల్లని ఒత్తైన పొడవాటి జుట్టు ఉండాలని అమ్మాయిలంతా కోరుకుంటారు. కానీ ఆ ఆశ అందరికీ నెరవేరడం లేదు. వాతావరణ కాలుష్యం, పోషకాహార లోపం, ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి, రక్తహీనత వంటి కారణాల వల్ల యువతులు, మహిళలు జుట్టురాలే సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు పాటించాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం!

  • పోషకాహారం: జుట్టు రాలడానికి ప్రధాన కారణం వెంట్రుకల కుదుళ్లు బలహీనమవడమే. కుదుళ్లు బలంగా ఉండాలంటే విటమిన్లు, మినరల్స్‌, ప్రొటీన్లు ఉండే పోషకాహారం తీసుకోవాలి. రోజూ ఆకుకూరలు, గుడ్లు, చేపలు, నట్స్‌, మొలకలు, పండ్లు ఉండేలా డైట్‌ ప్లాన్‌ చేసుకోవాలి.

  • మసాజ్‌: వెంట్రుకల కుదుళ్లు బలంగా ఉండేందుకు వాటికి తగినంత రక్త ప్రవాహం అందేందుకు మాడు మీద మసాజ్‌ చేసుకోవాలి. ప్రతిరోజూ కనీసం పదిహేను నిమిషాలు కొబ్బరినూనెతో తలమీద సున్నితంగా మర్దన చేసుకోవాలి. దీని వల్ల కుదుళ్లు ఉత్తేజితమై శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి.

  • గుడ్లు: జుట్టు రాలడాన్ని అరికట్టి వెంట్రుకలకు పోషణ అందించడంలో గుడ్లు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఒక గిన్నెలో కోడిగుడ్డు తెల్ల సొన వేసి నురుగు వచ్చేలా బాగా గిలక్కొట్టాలి. దీనిని వెంట్రుకల కుదుళ్లకు చేరేలా తలకు పట్టించాలి. కనీసం ఇరవై నిమిషాలు ఆరనివ్వాలి. తరవాత గోరువెచ్చని నీటితో కడిగి మైల్డ్‌ షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.


  • కొబ్బరి పాలు: కొబ్బరి పాలలో క్యాల్షియం, ఐరన్‌, పాస్పరస్‌, విటిమిన్లు, ప్రొటీన్లు సమృద్దిగా ఉంటాయి. తాజా కొబ్బరి పాలను తలకు పట్టించి అరగంట ఆరనివ్వాలి. తరవాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది. వెంట్రుకలకు కావాల్సిన తేమ, పోషణ అందుతాయి.

  • కలబంద: కలబంద గుజ్జును తలకు పట్టించి గంటసేపు ఆరనివ్వాలి. తరవాత గోరువెచ్చని నీటితో కడగాలి. కలబంద గుజ్జు తలలోని పీహెచ్‌ లెవెల్స్‌ని సమతుల్యం చేస్తుంది. చుండ్రుని నివారిస్తుంది.

  • గ్రీన్‌ టీ : ముందుగా గ్రీన్‌ టీ తయారు చేసుకుని చల్లార్చి పక్కన పెట్టండి. తలస్నానం పూర్తయిన తరవాత ఈ టీని తలకు, వెంట్రుకలకు పట్టించండి. ఇది మంచి కండిషనర్‌లా పనిచేసి వెంట్రుకలకు మెరుపునిస్తుంది. గ్రీన్‌ టీ లోని యాంటీ ఆక్సిడెంట్లు కుదుళ్లను బలోపేతం చేసి జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి.

Updated Date - Oct 19 , 2024 | 04:58 AM