Navya : ఈ టీలతో ఆరోగ్య రక్ష
ABN, Publish Date - Jun 27 , 2024 | 01:25 AM
హెర్బల్ టీతో మనసుకు, శరీరానికి సాంత్వన చేకూరడంతో పాటు కొన్ని రుగ్మతలు కూడా అదుపులోకొస్తాయి. కాబట్టి రుగ్మతకు తగిన టీని ఎంచుకుని, తరచూ తాగుతూ ఉండాలి.
హెల్తీ డ్రింక్
హెర్బల్ టీతో మనసుకు, శరీరానికి సాంత్వన చేకూరడంతో పాటు కొన్ని రుగ్మతలు కూడా అదుపులోకొస్తాయి. కాబట్టి రుగ్మతకు తగిన టీని ఎంచుకుని, తరచూ తాగుతూ ఉండాలి.
బ్లాక్ టీ
మధుమేహంతో పాటు హృద్రోగాల బారిన పడే అవకాశాలు తగ్గుతాయి.
రక్తంలో చక్కెర స్థాయులు స్థిరంగా ఉంటాయి.
వాపులు తగ్గిస్తుంది.
గ్రీన్ టీ
దీన్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ.
చెడు కొలెస్ర్టాల్‌ను తగ్గిస్తుంది.
కణాలు ఆరోగ్యంగా పెరగటానికి దోహదపడుతుంది.
సాంత్వన చేకూరుస్తుంది.
పెప్పర్మింట్
కఫం బయటికొచ్చేలా చేస్తుంది.
యాంటీ ఇన్ఫ్లమేటరీ (వాపులు తగ్గించేదిగా) పని చేస్తుంది.
ఆకలిని తగ్గిస్తుంది.
శొంఠి టీ
అలర్జీలను తగ్గిస్తుంది.
యాంటీ ఇన్ఫ్లమేటరీగా పని చేస్తుంది.
ప్రయాణాల్లో తలెత్తే మోషన్ సిక్‌నెస్‌ను నివారిస్తుంది.
రుచిని పెంచుతుంది.
దాల్చిన చెక్క టీ
కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.
వైరస్‌లతో పోరాడుతుంది.
ఆర్థ్రయిటిస్ లక్షణాలను పారదోలుతుంది.
Updated Date - Jun 27 , 2024 | 01:28 AM