ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

America: అట్టహాసంగా ముగిసిన ఆటా 18వ కన్వెన్షన్‌

ABN, Publish Date - Jun 13 , 2024 | 03:09 AM

నవత, యువత, భవిత... అనే నినాదంతో తెలుగు వారి అతి పెద్ద పండుగ ఆటా-2024 వేడుక అమెరికాలో ఘనంగా జరిగింది. జార్జియా వరల్డ్‌ కాంగ్రెస్‌ సెంటర్‌లో జూన్‌ 7 నుంచి9 వరకు అట్లాంటాలో జరిగిన 18వ ఆటా కన్వెన్షన్‌కు 18 వేల మందికి పైగా హాజరయ్యారు. ఆటా అధ్యక్షురాలు బొమ్మినేని మధు, కన్వీనర్‌ కిరణ్‌ పాశం నాయకత్వంలో తొలి రోజు బ్యాంకెట్‌ సమావేశం జరిగింది.

  • రికార్డ్‌ స్థాయిలో 18 వేలమంది హాజరు

హైదరాబాద్‌, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): నవత, యువత, భవిత... అనే నినాదంతో తెలుగు వారి అతి పెద్ద పండుగ ఆటా-2024 వేడుక అమెరికాలో ఘనంగా జరిగింది. జార్జియా వరల్డ్‌ కాంగ్రెస్‌ సెంటర్‌లో జూన్‌ 7 నుంచి9 వరకు అట్లాంటాలో జరిగిన 18వ ఆటా కన్వెన్షన్‌కు 18 వేల మందికి పైగా హాజరయ్యారు. ఆటా అధ్యక్షురాలు బొమ్మినేని మధు, కన్వీనర్‌ కిరణ్‌ పాశం నాయకత్వంలో తొలి రోజు బ్యాంకెట్‌ సమావేశం జరిగింది. తెలంగాణ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు, కాన్సులేట్‌ జనరల్‌ రమేష్‌ బాబు లక్ష్మణ్‌, ధ్యాన గురు దాజి, సినీ నటులు విజయ్‌ దేవరకొండ, ఆనంద్‌ దేవరకొండ, హీరో శ్రీకాంత్‌, హీరోయిన్‌ మెహ్రీన్‌, నేహా శెట్టి, తమ్మారెడ్డి భరద్వాజ, తనికెళ్ల భరణి హాజరయ్యారు.


జార్జియా రాష్ట్ర అభివృద్ధికి తెలుగు వారు తోడ్పడుతున్నారని జార్జియా గవర్నర్‌ బ్రయాన్‌ కెంప్‌ కొనియాడారు. నవత, యువత, భవిత అనే లక్ష్యాలతో ఈసారి కన్వెన్షన్‌ నిర్వహించామని బొమ్మినేని మధు తెలిపారు. ఇంత పెద్ద కన్వెన్షన్‌ చేయడం అంత తేలిక కాదని.. దీన్ని ముందుకు తీసుకువెళ్తామని ప్రెసిడెంట్‌ ఎలెక్ట్‌ జయంత్‌ చల్లా అన్నారు. శ్రీ సీతారామ కల్యాణం వైభవంగా జరిగింది. తెలంగాణ ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ కమిషనర్‌ హనుమంతరావు హాజరయ్యారు. వివిధ రంగాల్లో ప్రతిభాపాటవాలు చూపించిన 17 మందికి ఆటా అవార్డులు ప్రదానం చేశారు. వ ఆటా లైఫ్‌టైమ్‌ సర్వీస్‌ అవార్డును డాక్టర్‌ రాజేశ్వర్‌ రావు టేక్మాల్‌కు అందజేశారు. తెలంగాణ ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌ శ్రీనివాస్‌ రెడ్డిని సన్మానించారు. అట్లాంటాలో ఆటా మహాసభలు నిర్వహించడం ఇది మూడోసారి.

Updated Date - Jun 13 , 2024 | 03:09 AM

Advertising
Advertising