Australia Visa: ఆస్ట్రేలియా వీసా.. పెరుగుతున్న భారతీయుల దరఖాస్తుల తిరస్కరణ..కారణం ఇదేనా?
ABN, Publish Date - Feb 19 , 2024 | 09:35 PM
ఆస్ట్రేలియా కొత్త వీసా విధానం భారతీయులపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. తిరస్కరణకు గురవుతున్న భారతీయ విద్యార్థుల దరఖాస్తుల సంఖ్య ఇటీవల కాలంలో పెరిగింది.
ఎన్నారై డెస్క్: ఆస్ట్రేలియా కొత్త వీసా విధానం భారతీయులపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. తిరస్కరణకు గురవుతున్న భారతీయ విద్యార్థుల దరఖాస్తుల సంఖ్య (Aus Student Visa) ఇటీవల కాలంలో పెరిగింది. ప్రభుత్వం జరిమానాలకు జంకుతున్న అనేక యూనివర్సిటీలు అడ్మిషన్ ఆఫర్ లెటర్లను ఉపసంహరించుకుంటున్నాయి. గతేడాది చివరి రెండు త్రైమాసికాల్లో ప్రతి ఐదు అంతర్జాతీయ దరఖాస్తుల్లో ఒకటి తిరస్కరణకు గురైనట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి (Indians visa application being rejected).
NRI: ప్రపంచంలోనే అత్యంత బిజీ ఎయిర్ పోర్టులో ఎన్నారైల అరుదైన రికార్డు..!
స్థానిక మీడియా కథనాల ప్రకారం, కొత్త వీసా నిబంధనల కారణంగా ఈ ఏడాది ఆస్ట్రేలియాలో కొత్తగా 3,75,000 విదేశీ విద్యార్థులకే అనుమతులు దక్కుతాయి. వచ్చే ఏడాది ఈ సంఖ్య ఏకంగా 2,50,000కు తగ్గవచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఆస్ట్రేలియాలో దక్షిణాసియా దేశాల వారిలో సంఖ్యాపరంగా భారతీయ విద్యార్థులు ముందు వరుసలో ఉండగా ఆ తరువాతి స్థానాల్లో పాకిస్థాన్ నేపాల్ దేశస్తులు ఉన్నారు.
Study abroad: భారతీయుల్లో కెనడాపై అనాసక్తి.. ప్రస్తుతం మనోళ్ల చూపంతా అటే!
తాజా వలస విధానంలో భాగంగా విదేశీ విద్యార్థులు గతంలో కంటే ఎక్కువగా ఆదాయవనరులు సమకూర్చుకోవాలి. అంతేకాకుండా, ఇంగ్లిష్ భాషలో మరింత ప్రావిణ్యం ఉండాలి. ఈ ప్రమాణాలు లేని విదేశీ విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చే యూనివర్సిటీలను ప్రభుత్వం అధిక రిస్క్ ఉన్న సంస్థలుగా గుర్తించనుంది. ఫలితంగా ఆయా సంస్థల్లో చేరాలనుకునే విద్యార్థుల వీసాల జారీలో మరింత ఆలస్యమవుతుంది. ఈ నిబంధనలతో భయాందోళనలకు లోనవుతున్న యూనివర్సిటీలు గతంలో ఇచ్చిన ఆఫర్ లెటర్లను వెనక్కు తీసుకుంటున్నట్టు అక్కడి మీడియా చెబుతోంది.
మరిన్ని ఎన్నారై వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి
Updated Date - Feb 19 , 2024 | 09:44 PM