Indian Student: అమెరికాలో మరో భారతీయ విద్యార్థి మృతి.. ఇప్పటికీ ఎంత మంది చనిపోయారంటే
ABN, Publish Date - Apr 06 , 2024 | 08:14 AM
అగ్రరాజ్యం అమెరికా(america)లో మరో భారతీయ విద్యార్థి మృతి(Indian student dies) చెందిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. న్యూయార్క్(New York)లోని భారత కాన్సులేట్ శుక్రవారం ఓహియోలోని క్లీవ్‌ల్యాండ్‌లో ఉన్న ఉమా సత్యసాయి గద్దె(Uma Satya Sai Gadde) అనే భారతీయ విద్యార్థి మరణించినట్లు తెలిపింది.
అగ్రరాజ్యం అమెరికా(america)లో మరో భారతీయ విద్యార్థి మృతి(Indian student dies) చెందిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. న్యూయార్క్(New York)లోని భారత కాన్సులేట్ శుక్రవారం ఓహియోలోని క్లీవ్‌ల్యాండ్‌లో ఉన్న ఉమా సత్యసాయి గద్దె(Uma Satya Sai Gadde) అనే భారతీయ విద్యార్థి మరణించినట్లు తెలిపింది. ఈ మరణంపై పోలీసు విచారణ కొనసాగుతోందని, ఈ క్రమంలో భారతదేశంలోని సత్యసాయి కుటుంబంతో తాము టచ్‌లో ఉంటామని తెలిపింది. అయితే గత కొన్ని రోజులుగా పలువురు భారతీయ విద్యార్థులు మరణించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ఈ క్రమంలో న్యూయార్క్(New York)లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా(Consulate General of India) ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ చేస్తూ స్పందించింది. ఉమా సత్యసాయి భౌతికకాయాన్ని వీలైనంత త్వరగా భారతదేశానికి తిరిగి తీసుకురావడానికి వీలు కల్పిస్తామని వెల్లడించింది.
2024 ప్రారంభం నుంచి ఇప్పటివరకు అమెరికా(america)లో 9 మంది భారతీయ సంతతికి చెందిన విద్యార్థులు మరణించారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనలు భారతదేశం, భారతీయ అమెరికన్ ప్రజల్లో ఆందోళనను పెంచుతున్నాయని చెప్పవచ్చు. మరోవైపు విద్యార్థి మృతికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అసలు ఈ మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయని పలువురు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు ఇవి ప్రమాదవశాత్తు జరిగాయా లేదా హత్యాలా అని కూడా అడుగుతున్నారు.
మార్చిలో కోల్‌కతాకు చెందిన అమర్‌నాథ్ ఘోష్ అనే శాస్త్రీయ నృత్యకారుడు మిస్సోరిలోని సెయింట్ లూయిస్‌లో కాల్చి(firing) చంపబడ్డాడు. అదే నెలలో బోస్టన్ విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 20 ఏళ్ల విద్యార్థిని హత్య చేసి, మృతదేహాన్ని అమెరికాలోని అడవిలో పడేశారు. పర్డ్యూ యూనివర్శిటీలో 23 ఏళ్ల భారతీయ అమెరికన్ విద్యార్థి సమీర్ కామత్ ఫిబ్రవరి 5న ఇండియానాలోని కన్జర్వేషన్ ఏరియాలో శవమై కనిపించాడు. ఫిబ్రవరి 2న వివేక్ తనేజా 41 ఏళ్ల భారతీయ సంతతికి చెందిన ఐటి ఎగ్జిక్యూటివ్, వాషింగ్టన్‌లోని ఒక రెస్టారెంట్ వెలుపల జరిగిన దాడిలో ప్రాణాపాయ స్థితిలో కనిపించాడు. ఇలా అనేక ఘటనలు వెలుగులోకి వచ్చాయి.
ఇది కూడా చదవండి:
Child Marriage: 12 ఏళ్ల బాలికతో 63 ఏళ్ల పూజారి పెళ్లి.. కథలో ఫ్యూజులు ఎగిరిపోయే ట్విస్ట్
Sonam Wangchuk: ర్యాలీకి పిలుపునిచ్చిన సోనమ్ వాంగ్‌చుక్.. జిల్లాలో ఇంటర్ నెట్ బంద్, 144 సెక్షన్
మరిన్ని ప్రవాస వార్తల కోసం
Updated Date - Apr 06 , 2024 | 08:17 AM