NRI: 30 ఏళ్ల నాటి వేశ్య హత్య కేసులో దోషిగా ఎన్నారై.. కొత్త టెక్నాలజీతో తాజాగా వీడిన మిస్టరీ!
ABN, Publish Date - Feb 18 , 2024 | 09:10 PM
ఆధునిక ఫారెన్సిక్ సాంకేతిక సాయంతో లండన్ పోలీసులు 30 ఏళ్ల నాటి హత్య కేసును ఛేదించారు. ఈ కేసులో ఓ ఎన్నారై దోషిగా తేలడంతో అతడికి శుక్రవారం యావజ్జీవ కారాగార శిక్ష పడింది.
ఎన్నారై డెస్క్: ఆధునిక ఫారెన్సిక్ సాంకేతిక సాయంతో లండన్ పోలీసులు 30 ఏళ్ల నాటి హత్య కేసును ఛేదించారు. ఈ కేసులో ఓ ఎన్నారై (NRI) దోషిగా తేలడంతో అతడికి శుక్రవారం యావజ్జీవ కారాగార శిక్ష పడింది. ఘటనా స్థలంలో దొరికిని ఓ వెంట్రుక.. నిందితుడు సందీప్ పటేల్‌ను (51) కటకటాల పాలు చేసింది.
కేసు పూర్వాపరాల్లోకి వెళితే, లండన్‌లోని (London) వెస్ట్‌మినస్టర్ ప్రాంతంలోని ఓ ఫ్లాట్‌లో బాధితురాలు మెరీనా కొప్పెల్ ఒంటరిగా నివసిస్తుండేది. మసాజ్ థెరపిస్ట్‌గా పనిచేసే ఆమె వేశ్యవృత్తిలోనూ ఉండేది. వారాంతాల్లో నార్తాంప్టన్‌లోని భర్త, పిల్లల వద్దకు వెళ్లి వస్తుండేది. ఆమె గురంచి భర్తకు పూర్తిగా తెలుసు. తన సంపాదనతో కొంత మొత్తాన్ని కుటుంబానికి కూడా పంపించేది. కాగా, 1994 ఆగస్టు 4న మెరినా ఇంటికి రాకపోవడంతో భర్త కంగారు పడుతూ ఆమె ఫ్లా్ట్‌కు వెళ్లాడు. అక్కడ ఆమె రక్తపుమడుగులో అచేతనంగా పడి ఉంది. అప్పటికే ఆమె మృతి చెందింది (Indian-Origin Man Jailed For Life Over 30 Year Old UK Murder).
Study abroad: భారతీయుల్లో కెనడాపై అనాసక్తి.. ప్రస్తుతం మనోళ్ల చూపంతా అటే!
మరోవైపు, ఘటనా స్థలంలోని బ్యాగ్‌పై సందీప్ పటేల్ వేలి ముద్రలు పోలీసులకు లభించాయి. అయితే, ఆ బ్యాగు ఉన్న షాపులోనే సందీప్ కూడా పనిచేస్తుండటంతో పోలీసులకు ఎటువంటి అనుమానం రాలేదు. చివరకు ఈ కేసు మిస్టరీగా మారిపోయింది. 2008లో పోలీసులు మరోసారి ఈ కేసును పునఃపరిశీలించగా మెరీనా ఉంగరానికి చిక్కుకున్న వెంట్రుక లభించింది. అయితే, దీనిపై డీఎన్‌ఏ పరీక్ష జరిపి దోషిని గుర్తించే సాంకేతికత 2022లోనే అందుబాటులోకి వచ్చింది. మరోవైపు, 2012లో మరో కేసులో సందీప్ అరెస్ట్ కావడంతో..అతడి డీఎన్ఏ వివరాలతో సహా అన్ని రికార్డులు ప్రభుత్వానికి చేరాయి.
కొత్తగా అందుబాటులోకి వచ్చిన సాంకేతికత సాయంతో డీఎన్ఏ పరీక్షలు చేసిన నిపుణులు సందీప్‌ను దోషిగా తేల్చారు. మరోవైపు, హత్య జరిగిన రోజున మెరీనా ఫ్లాట్‌లో తస్కరణకు గురైన ఏటీఎం కార్డును ఎవరో వాడినట్టు పోలీసుల వద్ద రికార్డులు ఉన్నాయి. సందీప్ నివాసానికి కూతవేటు దూరంలో ఉన్న ఏటీఎంలో, హత్య జరిగిన కాసేపటికే ఈ కార్డుతో డబ్బు డ్రా చేశారు. ఈ మూడు ఆధారాలతో జ్యూరీ సభ్యులు సందీప్‌ను దోషిగా తేల్చారు. చివరకు అతడికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. ఎట్టకేలకు నిందితుడిని పట్టుకున్నందుకు పోలీసులు హర్షం వ్యక్తం చేశారు. అయితే, సందీప్ ఆమెను ఎందుకు చంపిందీ ఎప్పటికీ తెలీకపోవచ్చన్నారు. ఇలాంటి కేసులు చాలా సందర్భాల్లో అసంపూర్తిగానే ముగుస్తాయని విచారం వ్యక్తం చేశారు.
మరిన్ని ఎన్నారై వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి
Updated Date - Feb 18 , 2024 | 09:17 PM