ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

NRI: బీజేపీ గెలుపు కోసం ఎన్నారైల ప్రచారం

ABN, Publish Date - May 05 , 2024 | 06:17 PM

తెలంగాణ ప్రవాసీయులు పెద్ద సంఖ్యలో ఉన్న గల్ఫ్ దేశాలలో బీజేపీ అభిమానులు పార్టీ కోసం ప్రచారం చేస్తున్నారు.

BJP party workers meeting in Abudhabi

  • ఎడారులలో కదం తొక్కుతున్న కాషాయం

  • బయట శూన్యం లోపల ఘనం

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి ఇర్ఫాన్: తెలంగాణ ప్రవాసీయులు (NRI) పెద్ద సంఖ్యలో ఉన్న గల్ఫ్ దేశాలలో భారతీయ జనతా పార్టీ అభిమానులు వ్యూహాత్మకంగా గట్టుచప్పుడు కాకుండా లోపాయికారీగా ప్రచారం చేస్తున్నారు (Election Campaing for BJP). దుబాయి, షార్జా, అబుదాబి, మస్కట్, రియాధ్ మరియు కువైత్ నగరాలలో సాయంకాలం ప్రవాసీయులను కలుస్తూ స్వదేశంలోని కుటుంబ సభ్యులకు కమలం గుర్తుకు ఓటు వేయవల్సిందిగా సూచించాలని అభ్యర్ధిస్తున్నారు. అబుదాబిలో ప్రారంభమైన బాప్స్ హిందూ మందిరం ఇక్కడి అత్యధిక ప్రవాసీయులలో ఉద్వేగభరిత ఆనందయకమైన ఆంశంగా మారడం కూడా కమలం పార్టీకి చాలా వరకు అనుకూలిస్తోంది.

రాష్ట్ర స్థానిక పరిస్థితులలో ఎవరికి ఓటు వేశామనేది ముఖ్యం కాదని కేంద్రంలో మాత్రం నరేంద్ర మోదీ నాయకత్వాన్ని కోరుకోంటున్నట్లుగా అనేకులు తమ అంతర్గతాన్ని ఆవిష్కరిస్తున్నారు.

దుబాయి ఎమిరేట్స్‌లోని తెలంగాణ ప్రవాసీయులలో సింహభాగం ఉత్తర తెలంగాణ జిల్లాలకు చెందిన వారుండగా ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గాల నుండి గత ఎన్నికలలో బీజేపీ విజయం సాధించగా ఈ సారి కూడా తమ పార్టీ విజయధుందుభి మోగిస్తుందని కమలనాథులు విశ్వసిస్తున్నారు. లోక్‌సభ సభ్యులు బండి సంజయ్, ధర్మపురి అరవింద్‌లకు ఇక్కడి ప్రవాసీ యువతలో చెప్పుకోదగ్గ అభిమానులు ఉన్నారు. ధర్మపురి అరవింద్ తరుచుగా దుబాయి పర్యటనలకు వస్తూ వీలయినంత ఎక్కువ మంది యువకులతో సమావేశాలు జరుపుతుండడం పార్టీకి కలిసి వస్తున్న ఆంశం.

America Tech Industry: 'ఇండియన్స్ లేకుండా US టెక్ పరిశ్రమ మనుగడ కష్టం'


ఒక్క ఉత్తర తెలంగాణకు మాత్రమే పరిమితం కాకుండా అటు ఆసిఫాబాద్ నుండి ఇటు జహీరాబాద్ వరకు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రవాసీయులను ప్రణాళికాబద్ధంగా కలిసి ఓట్లను అభ్యర్ధిస్తున్నట్లుగా బీజేపీ అనుబంధ ప్రవాసీ సంఘమైన ఇండియన్ పీపుల్స్ ఫోరం యు.ఏ.ఇ అధ్యక్షుడు కుంభాల మహెందర్ రెడ్డి వెల్లడించారు.

నరేంద్ర మోదీ మూడవ సారి ప్రధానిగా ఎన్నిక కావాలని కోరుతూ ఆదివారం అబుదాబిలోని బాప్స్ హిందూ మందిరంలో ప్రత్యేక పూజలు చేసిన ఆనంతరం దేవాలయ నిర్మాణానికి కృషి చేసిన మోదీకి కార్యకర్తలు కృతజ్ఞతలు తెలిపారు. మూడవసారి ప్రధానిగా ఎన్నికయితే మోదీ హయాంలో గల్ఫ్ దేశాలతో భారత సంబంధాలు మరింత పటిష్ఠమవుతాయని మహెందర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేసారు. కార్యక్రమంలో మహెందర్ రెడ్డితో పాటు ఆరే శరత్ గౌడ్, పెనుకుల అశోక్, పవన్ సాయి, శ్రీను, సాయి, దేవన్న,ప్రశాంత్, ఎండపెల్లి తిరుపతి పటేల్, రమేశ్, నవీన్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

సెలవులపై స్వదేశానికి వెళ్తున్న అనేక మంది బీజేపీ అభిమానులు మండెండలో తమ కుటుంబ సభ్యులతో గడపడానికి బదులుగా తమ తమ ప్రాంతాలలో బీజేపీ పక్షాన ప్రచారం చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. కేవలం వాట్సాప్ అంటే ఏలా అని, కార్యక్షేత్రంలో కూడా దిగక తప్పదని బీజేపీ పక్షాన ఎన్నికల ప్రచారానికి వెళ్ళిన ఫుజిరాలో పని చేసే జగిత్యాల జిల్లా రాయికల్ మండలానికి చెందిన యస్. మల్లారెడ్డి విమానం ఎక్కక ముందు చెప్పారు.


ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, అన్నమయ్య జిల్లాలో ఒక భాగంగా భావించే కువైత్‌లో రాజంపేట లోక్‌సభ నియోజకవర్గానికి చెందిన వారు భారీ సంఖ్యలో ఉన్నారు. కొన్ని గ్రామాల నుండి ఒక్కొక్క గ్రామం నుండి 500కు పైగా కుటుంబాలు కువైత్‌లో పని చేస్తున్నాయి. రాజంపేట నుండి మాజీ ముఖ్యమంత్రి యన్. కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తుండగా ఆయనకు మద్దతు కోరుతూ మంగఫ్ ప్రాంతంలోని అనేక చోట్ల సాయంకాలం బీజేపీ అభిమానులు ప్రచారం చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ ప్రచారం కోసం కువైత్ నుండి వచ్చిన జ్యోత్స్న తెలుగుదేశం పార్టీ ఏలూరు పార్లమెంటు అభ్యర్ధి పుట్ట మహేశ్ యాదవ్‌తో పాటు కైకలూరు నుండి బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న కామినేని శ్రీనివాసరావుకు మద్దుతుగా ప్రవాసీయులతో ప్రచారం చేస్తున్నారు.

Read NRI and Telugu News

Updated Date - May 05 , 2024 | 06:22 PM

Advertising
Advertising