NRI: బే ఏరియాలో ‘తెలుగుదేశం-జనసేన-బీజేపీ’ ఎన్నారైల సమావేశం!
ABN, Publish Date - Mar 19 , 2024 | 03:41 PM
అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో బే ఏరియాలో స్థిరపడిన ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన అత్యంత ప్రభావశీలురైనటువంటి ఎన్నారైలు ఆదివారం సాయంత్రం.. మే 13 న జరగబోయే ఎన్నికల సంబంధించిన సమావేశం నిర్వహించారు.
ఎన్నారై డెస్క్: అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో బే ఏరియాలో స్థిరపడిన ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన అత్యంత ప్రభావశీలురైనటువంటి ఎన్నారైలు (NRI) ఆదివారం సాయంత్రం.. మే 13 న జరగబోయే ఎన్నికల సంబంధించిన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వందమందికి పైగా ప్రముఖులు పాల్గొని కీలక చర్చలు జరిపారు. రాబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకుని రావాల్సిన ఆవశ్యకత గురించి చర్చించారు. గత ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న అరాచక పాలన మీద పలువురు ఎన్నారైలు ఆందోళన వ్యక్తం చేసారు. 2014లో మాదిరి కూటమి బంపర్ మెజారిటీ సాధించడం ఖాయం అంటూ కొంతమంది ఎన్నారైలు తమ అభిప్రాయాలు తెలిపారు.
ఈ సమావేశంలో తణుకు తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి అరిమిల్లి రాధాకృష్ణ, నందిగామ తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి తంగిరాల సౌమ్య, జనసేన నాయకులు బొలిశెట్టి సత్యనారాయణ జూమ్ కాల్‌లో పాల్గొని తమ అమూల్యమైన సందేశాన్ని ఇచ్చారు. జనసేన నాయకులు బొలిశెట్టి సత్య మాట్లాడుతూ, జన సైనికులు నిరాశకి ఎక్కడా తావివ్వకుండా పొత్తు ధర్మం పాటించి 175 నియోజకవర్గాల్లో బయటకి వచ్చి తెలుగుదేశం కార్యకర్తలతో కలిసి పనిచేసి అఖండ మెజారిటీ దిశగా పని చేయాలని పిలుపు ఇవ్వగా ఒక్కసారిగా ఆడిటోరియం కరతాళధ్వనులతో మారుమ్రోగింది.
మరిన్ని వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి
Updated Date - Mar 19 , 2024 | 03:41 PM