ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

CM Revanth Reddy: మందు తాగకపోవడానికి కారణమిదే: రేవంత్ రెడ్డి

ABN, Publish Date - Feb 17 , 2024 | 12:13 PM

Open Heart With RK-Revanth Reddy: ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ ప్రోగ్రామ్‌లో రేవంత్ రెడ్డి(Revanth Reddy) తన వ్యక్తిగత వివరాల గురించి కీలక వివరాల చెప్పుకొచ్చారు. ముఖ్యంగా తన వ్యక్తిగత అభిరుచుల గురించి వెల్లడించారు.

Open Heart With RK-Revanth Reddy

Open Heart With RK-Revanth Reddy: ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ ప్రోగ్రామ్‌లో రేవంత్ రెడ్డి(Revanth Reddy) తన వ్యక్తిగత వివరాల గురించి కీలక వివరాల చెప్పుకొచ్చారు. ముఖ్యంగా తన వ్యక్తిగత అభిరుచుల గురించి వెల్లడించారు. తాను 24 గంటలు ప్రజల్లో ఉండేందుకు ఆసక్తి చూపుతానని అన్నారు రేవంత్ రెడ్డి. తనకు ‘వ్యాపారం లేదు.. వ్యాపకం లేదు.. మందు తాగే అలవాటు లేదు.. మరే ఇతర అలవాటు లేదు. పబ్లిక్‌లోనే ఉంటా.. అందరినీ కలుస్తా.. అందరితో మాట్లాడుతాను’ అని చెప్పుకొచ్చారు.

ముందు అలవాటు ఎందుకు లేదని ఆర్కే ప్రశ్నించగా.. తనకు మొదటి నుంచి సరదా కోసం తిరగడం అలవాటు లేదన్నారు. ‘చిన్నప్పటి నుంచి లైక్స్, డిస్‌లైక్స్ ఉన్నాయి. గ్రామం, పెరిగిన పరిస్థితులు, నాన్న, చిన్నానలు, కుటుంబ పరిస్థితులు, కేసులు, జైల్లు, గ్రామ కక్షలు, మందు ప్రభావం కారణంగా వ్యవస్థ పాడవుతుందనే అభిప్రాయం ఏర్పడింది. ముందుపై మానసికంగా ఒకరమైన భావన ఏర్పడింది. అందుకే.. యంగ్ ఏజ్‌లోనే మందు అలవాటు కాలేదు. ఇప్పుడు కూడా ఆ అవసరం రాలేదు. అందుకే మందు అలవాటు లేదు. వాస్తవానికి కాలేజీలో స్నేహితులతో సరదాగా తిరిగేటప్పుడు ఇలాంటి అలవాట్లు సరదాగా కోసం అని మొదలవుతాయి. ఆ తరువాత వ్యసనంగా మారుతాయి. కానీ, నాకు ఆ వయసులో అలవాటు కాలేదు. ఇప్పుడు ఆ అవసరం రాలేదు. కొందరికి ఆదర్శంగా ఉండాలనుకున్నప్పుడు కొన్ని విషయాలను దూరం చేయాలి. నాయకుడు అనేవాడు వెనక్కి తిరిగి పోస్ట్‌మార్టం చేసినా.. చీకటి కోణం ఎడైనా చూద్దామనుకున్నా అవకాశం ఇవ్వకుండా ఉండాలి.’ అని చెప్పుకొచ్చారు రేవంత్ రెడ్డి.

మరిన్ని ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే వీడియోస్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Mar 23 , 2024 | 11:25 PM

Advertising
Advertising