తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు.. ముఖ్యమంత్రి జగన్‌పై ఈ ఐదు ప్రశ్నలతో విరుచుకుపడ్డారు. ప్రజలకు ఇచ్చిన మాట తప్పిన ఆయనకు ఓటడిగే హక్కు ఎక్కడిదని నిలదీశారు. ప్రజాగళంలో భాగంగా గురువారం అన్నమయ్య జిల్లా రాయచోటిలో, కడప జిల్లా కేంద్రంలో జరిగిన భారీ బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు.
2019 ఎన్నికల సమయంలో జగన్ మేనిఫెస్టోలో చెప్పిన వాటిలో 99 శాతం అమలు చేయలేదని ఆరోపించారు. టీడీపీ హయాంలో రూ.60 ఉన్న మద్యం ఇప్పుడు రూ.200 అయిందని.. పెరిగిన రూ.140 తాడేపల్లి ప్యాలెస్‌కు వెళ్తోందన్నారు. తాము దమ్మున్న ప్రజా మేనిఫెస్టో తెచ్చామని.. దాని ముందు జగన్ మేనిఫెస్టో వెలవెలబోయిందని చంద్రబాబు అన్నారు.