కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు
ABN, Publish Date - Dec 12 , 2024 | 07:33 AM
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో బుధవారం వెలగపూడి సచివాలయంలో ప్రారంభమైన కలెక్టర్ల సదస్సులో సీఎం ప్రారంభోపన్యాసం చేశారు. జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులకు దిశా నిర్దేశం చేశారు. రాష్ట్రంలో పరిస్థితి గాడిలో పడుతోందని, ఇప్పుడిప్పుడే చీకట్లు తొలగిపోతున్నాయని, గత ప్రభుత్వంలో ప్రజలు మాట్లాడటానికి భయపడేవారని అన్నారు. ఇప్పుడు స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పే పరిస్థితి వచ్చిందని, బయట ప్రజలు నవ్వుతూ ఉన్నారంటే ప్రభుత్వంపై నమ్మకం ఏర్పడినట్టేనని.. దీనిని కొనసాగించేలా మన పాలన కొనసాగాలని చంద్రబాబు అన్నారు.
Updated Date - Dec 12 , 2024 | 07:34 AM