ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆదివాసీ దినోత్సవంలో గిరిజనులతో సీఎం చంద్రబాబు..

ABN, Publish Date - Aug 10 , 2024 | 11:02 AM

అమరావతి: అంతర్జాతీయ గిరిజన దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఆదివాసీ దినోత్సవానికి హాజరై గిరిజనులతో మమేకమయ్యారు. పాడేరు గిరిజన కళాకారుల సంప్రదాయ థింసా నృత్యంలో పాల్గొని వారితో కలిసి స్పెప్పులేశారు. గిరిజనులతో కలిసి సందడి చేశారు. ఆ తర్వాత డప్పు కొట్టి గిరిజనులను ఉత్సాహ పరిచారు. వివిధ వేషధారణలతో వచ్చిన వారితో కలిసి ఫోటోలు దిగుతూ.. ముచ్చటించారు. అనంతరం ఆదివాసీల జీవనశైలికి సంబంధించిన పనిముట్లతో ఎర్పాటు చేసిన ప్రదర్శనను సీఎం చంద్రబాబు తిలకించారు. ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేసిన ఉత్పత్తులు.. వాటి వివరాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

1/9

విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఆదివాసీ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు.. గిరిజనుల ఆరాధ్య దేవతకు పూజా కార్యక్రమాలు చేస్తున్న దృశ్యం.,. ప్రక్కన మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ఎమ్మెల్యే బోండా ఉమ.. తదితరులు.

2/9

తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు..

3/9

విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఆదివాసీ దినోత్సవ కార్యక్రమంలో ప్రసంగిస్తున్న మంత్రి గుమ్మడి సంధ్యారాణి..

4/9

తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఆదివాసీ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తున్న ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు..

5/9

గిరిజనుల సంప్రదాయ కిరీటం ధరించి, బాణం ఎక్కిపెట్టిన సీఎం చంద్రబాబు..

6/9

గిరిజనులతో కలిసి థింసా నృత్యం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు..

7/9

గిరిజన మహిళలతో మమేకమై స్పెప్పులేస్తున్న సీఎం చంద్రబాబు.

8/9

గిరిజనులతో కలిసి డప్పు వాయిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు..

9/9

ఆదివాసీల జీవనశైలికి సంబంధించిన ఉత్పత్తులు, పనిముట్లతో ఎర్పాటు చేసిన ప్రదర్శనను సీఎం చంద్రబాబు తిలకించారు. ఈ సందర్భంగా గిరిజన తేనెను చంద్రబాబు కొనుగోలు చేశారు.

Updated Date - Aug 10 , 2024 | 11:04 AM

Advertising
Advertising