ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న మంత్రి కొల్లు రవీంద్ర

ABN, Publish Date - Oct 29 , 2024 | 11:38 AM

విశాఖ: సింహాద్రి అప్పన్న స్వామిని మంత్రి కొల్లు రవీంద్ర మంగళవారం ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రికి దేవస్థానం అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం కప్పస్తంభం ఆలింగనం, బేడ మండపం ప్రదక్షిణ చేసిన మంత్రి కొల్లు రవీంద్ర అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత వేద పండితులు మంత్రికి ఆశీర్వచనం చేసి.. స్వామివారి తీర్థ, ప్రసాదాలు అందజేశారు. ఆలయ అధికారులు మంత్రి కొల్లు రవీంద్రకు స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.

1/5

మంత్రి కొల్లు రవీంద్ర మంగళవారం ఉదయం సింహాద్రి అప్పన్నను దర్శించుకునేందుకు పూలు, తులసిమాలతో ఆలయానికి వస్తున్న దృశ్యం..

2/5

లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని స్వామికి నమస్కరిస్తున్న మంత్రి కొల్లు రవీంద్ర..

3/5

సింహాద్రి అప్పన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న రాష్ట్ర గనులు భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర..

4/5

ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న మంత్రి కొల్లు రవీంద్రకు హారతి ఇచ్చి.. అక్షింతలు వేసి ఆశీర్వదిస్తున్న అర్చకులు..

5/5

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకున్న మంత్రి కొల్లు రవీంద్రకు స్వామి వారి మెమెంటోను బహుకరిస్తున్న ఆలయ అధికారులు..

Updated Date - Oct 29 , 2024 | 11:38 AM