ఏయూ అల్యూమిని మీట్‌లో మంత్రి లోకేష్
ABN, Publish Date - Dec 08 , 2024 | 11:46 AM
విశాఖ: రాబోయే రోజుల్లో ఆంధ్రా యూనివర్శిటీ గత వైభవాన్ని తిరిగి పొందడమే కాకుండా భారతదేశంలో టాప్ – 3, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్ 100లో ఒకటిగా నిలిపేందుకు తాము కృషి చేస్తున్నట్లు రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. శనివారం ఆంధ్రా యూనివర్సిటీ యాన్యువల్ అల్యూమిని మీట్‌ను ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించారు. ఆంధ్ర యూనివర్శిటీని అంతర్జాతీయ స్థాయిలో మేటిగా నిలపాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయమని అన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి లోకేష్ గౌరవ అతిధిగా హాజరుకాగా. ఎల్ అండ్ టి చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్, జిఎంఆర్ గ్రూప్ సంస్థల అధినేత గ్రంధి మల్లిఖార్జునరావు, ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యుడు పద్మశ్రీ డాక్టర్ ఎస్ వి ఆదినారాయణరావు తరఫున ఆయన సతీమణి శశిప్రభ హాజరయ్యారు.
Updated Date - Dec 08 , 2024 | 11:46 AM