ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Nijam Gelavali: కడప జిల్లాలో భువనేశ్వరి పర్యటన

ABN, Publish Date - Apr 05 , 2024 | 11:26 AM

కడప: నిజం గెలవాలి పర్యటనలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి కడప జిల్లాలో పర్యటించారు. చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక మృతి చెందిన బాధిత కుటుంబాలను ఆమె పరామర్శించి.. ఆర్థిక సాయం అందించారు. ఈ క్రమంలో మండుటెండను కూడా లెక్క చేయకుండా భువనేశ్వరిని కలిసేందుకు భారీగా టీడీపీ కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ది కోసం చంద్రబాబు రాత్రింబవళ్లు కష్టపడ్డారన్నారు. వైసీపీ రాక్షసపాలనలో టీడీపీ కార్యకర్తలను చంపడం, హింసించడం, ఇబ్బందులు పెట్టడం అలవాటుగా మారిందని ఆమె విమర్శించారు. వైసీపీ చేసే ప్రతీ తప్పును చంద్రబాబుపై నెట్టేస్తున్నారని మండిపడ్డారు. గంజాయి, ఇసుక, భూకబ్జాలు, కల్తీ మద్యం మాఫియా ముఠాలలో ఏపీని వైసీపీ ముందు వరుసలో నిలబెట్టిందని భువనేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు.

1/5

నిజం గెలవాలి పర్యటనలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి గురువారం కడప జిల్లాలో పర్యటించారు. మండుటెండను కూడా లెక్క చేయకుండా భువనేశ్వరిని కలిసేందుకు భారీగా టీడీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలివచ్చారు.

2/5

ప్రొద్దుటూరు మండలం, పెదశెట్టిపల్లి గ్రామంలో టీడీపీ కార్యకర్త కూరపాటి రాధ చిత్రపటానికి పూలదండ వేసి నివాళులు అర్పించిన నారా భువనేశ్వరి.

3/5

కూరపాటి రాధ కుటుంబాన్ని పరామర్శించి.. ఆర్థిక సాయం అందజేస్తున్న నారా భువనేశ్వరి.

4/5

చంద్రబాబు అక్రమ అరెస్టు సమయంలో గుండెపోటుతో మృతిచెందిన కడప టౌన్, 44వ వార్డు టీడీపీ కార్యకర్త వరద చెండ్రాయుడు కుటుంబాన్ని పరామర్శించి.. ఆర్థిక సహాయం అందజేస్తున్న నారా భువనేశ్వరి.

5/5

కడప 44వ వార్డులో కార్యకర్త వరద చెండ్రాయుడు కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తునన నారా భువనేశ్వరి

Updated Date - Apr 05 , 2024 | 11:26 AM

Advertising
Advertising