Lokesh: రాజాంలో నారా లోకేష్ శంఖారావం సభ..
ABN, Publish Date - Feb 16 , 2024 | 12:17 PM
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన ‘శంఖారావం’ కార్యక్రమంలో భాగంగా గురువారం విజయనగరం జిల్లా, రాజాంలో శంఖారావం సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌తో పాటు ఎమ్మెల్యేలు, మంత్రులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
విజయనగరం జిల్లా, రాజాంలో శంఖారావం సభకు విచ్చేన టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అభివాదం తెలుపుతున్న దృశ్యం.
రాజాంలో జరిగిన శంఖారావం సభలో పాల్గొన్న నారా లోకేష్ .. ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్న దృశ్యం.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాజాంలో నిర్వహించిన శంఖారావం సభలో పాల్గొని ప్రసంగిస్తున్న టీడీపీ సీనియర్ నేత కిమిడి కళా వెంకట్రావు..
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్వహించిన శంఖారావం సభకు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్న టీడీపీ కార్యకర్తలు, అభిమానులు..
టీడీపీ విజయం కోసం అందరం కలిసికట్టుగా ముందుకు నడుద్దామంటూ శంఖారావం సభ వేదికపై లోకేష్‌తోపాటు కిమిడి కళా వెంకట్రావు, స్థానిక నేతలు చేయీ చేయి కలుపుతూ నినదిస్తున్న దృశ్యం.
నారా లోకేష్‌కు టీడీపీ నేతలు ‘అభినందన అక్షర పట్టాభిషేకం’ మెమొంటో బహుకరిస్తున్న దృశ్యం..
Updated Date - Feb 16 , 2024 | 12:17 PM